Kerala: కల్తీ మద్యం తాగి ఐదుగురు మృతి

కేర‌ళ‌ (Kerala) లో దారుణం చోటుచేసుకుంది. కల్తీ మద్యం (spurious liquor) తాగి ఐదుగురు మరణించిన విషాద సంఘటన రాష్ట్రంలోని పాలక్కాడ్ జిల్లా వలయార్ ప్రాంతంలోని చెల్ల‌నం గిరిజ‌న కాల‌నీ (Chellanam tribal colony) లో జరిగింది.

Last Updated : Oct 20, 2020, 03:05 PM IST
Kerala: కల్తీ మద్యం తాగి ఐదుగురు మృతి

5 people died allegedly after consuming spurious liquor: న్యూఢిల్లీ‌: కేర‌ళ‌ (Kerala) రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. కల్తీ మద్యం (spurious liquor) తాగి ఐదుగురు మరణించిన విషాద సంఘటన రాష్ట్రంలోని పాలక్కాడ్ జిల్లా వలయార్ ప్రాంతంలోని చెల్ల‌నం గిరిజ‌న కాల‌నీ (Chellanam tribal colony) లో జరిగింది. అయితే ఇప్పటివరకు ఐదుగురు మరణించగా.. 9 మంది తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురయ్యారు. అస్వస్థకు గురైన వారిలో ముగ్గురు మ‌హిళ‌లు కూడా ఉన్నట్లు వలయార్ పోలీసులు (Walayar police) తెలిపారు. అయితే అనారోగ్యానికి గురైన వారిని ఆసుపత్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. చనిపోయిన వారంతా కార్మికులేనని పోలీసులు తెలిపారు. అయితే ఈ ఘటన వెనుక ఉన్న అస‌లు కార‌ణాల కోసం పోలీసులు, ఫొరెన్సిక్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

అయితే న‌కిలీ మ‌ద్యం తాగి మరణించిన వారంతా బంధువులేనని పోలీసులు వెల్లడించారు. మ‌ద్యంలో శానిటైజ‌ర్ కలిపినట్లు స్థానిక వ్యక్తి తెలపడంతో.. మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకోని దర్యాప్తు కోసం ఫొరెన్సిక్ ల్యాబ్‌కు తరలించారు. అయితే కెమికల్ రిపోర్టు వస్తేగానీ కచ్చితమైన కారణం చెప్పలేమని వలయార్ పోలీసు అధికారి తెలిపారు. Also read: NEET 2020 Results: ‘నీట్‌’గా లేదు.. ఆలిండియా టాపర్‌ సైతం ఫెయిల్‌

వలయార్ ప్రాంతంలోని చెల్ల‌నం గిరిజ‌న కాల‌నీలో ఓ వ్యక్తి అంత్య‌క్రియ‌ల‌కు వెళ్లిన వారంతా శివ‌న్ అనే వ్య‌క్తి ఇంట్లో మ‌ద్యం తాగారు. వారంతా తీవ్ర అస్వ‌స్థ‌త‌కు లోనై ఆదివారం నుంచి ఒక్కొక్కరిగా మ‌ర‌ణించినట్లు పోలీసులు తెలిపారు. మృత‌దేహాల‌ను పోస్టుమార్ట‌మ్ నిమిత్తం పోలీసులు ఆసుపత్రికి తరలించారు. దీంతో ఈ ప్రాంతంలో విషాదం నెలకొంది. Also read: Navratri Day 4: అన్నపూర్ణ దేవి అవతారంలో అమ్మవారు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News