కరోనా మహమ్మారి ( Corona pandemic ) కారణంగా ఇప్పటివరకూ కంపెనీలకే పరిమితమైన జీతాల కోత ఇప్పుడు పార్లమెంట్ కు సైతం వర్తించింది. ఎంపీల జీతాల్లో 30 శాతం కోత విధించే బిల్లును లోక్ సభ ఆమోదించింది.
కరోనా వైరస్ ( Coronavirus ) మహమ్మారి కారణంగా ప్రజానీకంతో సహా దేశం మొత్తం ఆర్ధిక ఇబ్బందులతో తల్లడిల్లుతోంది. కొన్ని కంపెనీలు ఉద్యోగుల్ని తొలగించగా..మరి కొన్ని కంపెనీలు నో వర్క్ నో పే విధానాన్ని అనుసరిస్తున్నాయి. ఇంకొన్ని కంపెనీలు మాత్రం జీతాల్లో కోత విధించాయి. ఇప్పుడు ఇదే జీతాల కోత ( Salaried deduction ) పార్లమెంట్ ఎంపీలకు కూడా వర్తిస్తోంది. ఏడాది పాటు ఎంపీల జీతంలో 30 శాతం కోత ( 30 percent deduction ) విధించనున్నారు. దీనికి సంబంధించిన బిల్లుకు లోక్ సభ ( Loksabha ) ఆమోదం తెలిపింది. కరోనా వైరస్ పై పోరాటంలో నిధుల కొరత ఉండకూడదన్న ఉద్దేశ్యంలో ఈ బిల్లును రూపొందించారు. కేంద్ర కేబినెట్ ఆమోదించిన ఈ తీర్మానాన్ని లోక్ సభ ఆమోదించింది.పార్లమెంటు సభ్యుల జీతం, భత్యాలు, పెన్షన్ (సవరణ) బిల్లు, 2020గా ఈ బిల్లు ఉంది. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, పలువురు గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు స్వచ్ఛందంగా వేతనాల కోతకు ఇప్పటికే అంగీకారం తెలిపారు. ఈ మొత్తం నిధులన్నీ సంఘటిత నిధికి జమకానున్నాయి. మరోవైపు కరోనా వ్యాప్తిని అరికట్టే చర్యల్లో భాగంగా ఎంపీ ల్యాడ్స్ నిధుల్ని ఇప్పటికే రద్దు చేశారు.
దేశంలో ఇప్పటి వరకు 49 లక్షల 33 వేల 188 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 9 లక్షల 92 వేల 850 యాక్టివ్ కేసులున్నాయి. 38 లక్షల 58 వేల 815 మంది కోలుకున్నారు. Also read: India China face off: ఇంకా అలానే సరిహద్దు వివాదం: రక్షణ మంత్రి రాజ్‌నాథ్