Loksabha Election 2024 Results: లోక్‌సభ ఎన్నికల్లో బలపడుతున్న ఇండియా కూటమి, ముందంజలో రాహల్ గాంధీ

Loksabha Election 2024 Results: లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో అనూహ్య పరిణామాలు సంభవిస్తున్నాయి. దక్షిణాదిన బీజేపీ లేదా ఎన్డీయే కూటమి పుంజుకుంటే ఉత్తరాదిన ఇండియా కూటమి బలపడుతోంది. అన్నింటికంటే ముఖ్యంగా మోదీ వెనుకంజలో ఉండి రాహుల్ ముందంజలో ఉన్నారు.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 4, 2024, 10:46 AM IST
Loksabha Election 2024 Results: లోక్‌సభ ఎన్నికల్లో బలపడుతున్న ఇండియా కూటమి, ముందంజలో రాహల్ గాంధీ

Loksabha Election 2024 Results: లోక్‌సభ 2024 ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యపరుస్తున్నాయి. ఏపీలో అనూహ్యంగా తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమి దూసుకుపోతోంది. మరోవైపు కేంద్రంలో రాహుల్ గాంధీ పోటీ చేసిన రెండు స్థానాల్లో ఆధిక్యంలో ఉంటే, ప్రధాని మోదీ అనూహ్యంగా వారణాసిలో వెనుకంజలో ఉన్నారు. 

లోక్‌సభ 2024 ఎన్నికల ఫలితాలు విస్మయపరుస్తున్నాయి. 4 వందల మార్క్ అంటూ చెప్పుకున్న ఎన్డీఏ 300 మార్క్ దాటేందుకు కష్టపడుతోంది. అదే సమయంలో ఇండియా కూటమి అనూహ్యంగా పుంజుకుంది. ఏకంగా 200 మార్క్ దాటేసి ఆధిక్యం ప్రదర్శిస్తోంది. ఎన్డీఏ కూటమి 296 సీట్లలో ఆధిక్యంలో ఉంటే ఇండియా కూటమి 232 స్థానాల్లో మెజార్టీలో ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఆధిక్యంలో ఉన్నారు. కేరళలోని వాయనాడ్‌లో  ఏకంగా 18 వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇక్కడ ఆయనకు ప్రత్యర్ధిగా సీపీఐ ఉండటం విశేషం. ఇక రాహుల్ గాంధీ పోటీ చేసిన మరో నియోజకవర్గం రాయబరేలి. ఇక్కడ కూడా ఆయన ముందంజలో ఉన్నారు. 28 వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. రాయబరేలి గాంధీ కుటుంబానికి బలమైన కోటగా ఉంది. 

ఇక ఈ ఎన్నికల్లో అందర్నీ విస్మయపరుస్తోంది ప్రధాని మోదీ వెనుకంజలో ఉండటం. మోదీ పోటీ చేసిన యూపీలోని వారణాసిలో 5 రౌండ్లు ముగిసేసరికి ఏకంగా 6 వేల పైచిలుకు ఓట్లతో వెనుకంజలో ఉన్నారు. మోదీపై ఇప్పటికే రెండుసార్లు పోటీ చేసి ఓడి మూడోసారి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్ధి అజయ్ రాయ్ ఆధిక్యం కనబరుస్తున్నారు. వారణాసిలో 2014 ఎన్నికల్లో మోదీ 80 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధిస్తే 2019లో 60 వేల ఓట్ల మెజార్టీ దక్కించుకున్నారు. 

Also read: Vijayawada Lok Sabha Election Result: విజయవాడలో విజయం ఎవరిది అన్నదా తమ్ముడిదా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News