Gelatin Sticks in Car: కారులో 1000 జిలెటిన్ స్టిక్స్.. కలకలం రేపిన పేలుడు పదార్థాలు

1000 gelatin sticks found in a car: మహారాష్ట్రలోని థానే జిల్లాలో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో ఓ కారులో 1000 జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్స్ పట్టుబడ్డాయి. ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 2, 2022, 07:41 AM IST
  • మహారాష్ట్ర థానే జిల్లాలో పేలుడు పదార్థాల కలకలం
  • కారులో వెయ్యి జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్స్
  • ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Gelatin Sticks in Car: కారులో 1000 జిలెటిన్ స్టిక్స్.. కలకలం రేపిన పేలుడు పదార్థాలు

1000 gelatin sticks found in a car: మహారాష్ట్రలోని థానే జిల్లాలో భారీగా పేలుడు పదార్థాలు పట్టుబడ్డాయి. ఓ కారులో తరలిస్తున్న 1000 జిలెటిన్ స్టిక్స్, అంతే మొత్తంలో డిటోనేటర్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. భీవండి నిజాంపుర పోలీస్ స్టేషన్ పరిధిలోని నది నకా ప్రాంతంలో ఓ కారులో భారీగా పేలుడు పదార్థాలు తరలిస్తున్నట్లు వారికి సమాచారం సమాచారం అందింది. వెంటనే రంగంలో దిగిన పోలీసులు ఆ ప్రాంతంలో ఓ మారుతి ఎకో కారును తనిఖీ చేశారు. అందులో వెయ్యి జిలెటిన్ స్టిక్స్, వెయ్యి డిటోనేటర్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.

ఆ పేలుడు పదార్థాలను తరలిస్తున్న అల్పేష్ పాటిల్, పంకజ్ చవాన్, సమీర్ వేద్గ అనే ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ముగ్గురిని పాల్ఘర్ జిల్లా విక్రమ్‌గడ్ వాసులుగా గుర్తించారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. ఆ పేలుడు పదార్థాలను వీరు దొంగలించారు. వాటిని ఎవరికైనా విక్రయించి సొమ్ము చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నట్లు గుర్తించారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

గతేడాది ముంబైలోని ప్రముఖ వ్యాపార దిగ్గజం అంబానీ (Mukesh Ambani) ఇంటి వద్ద పేలుడు పదార్థాలతో కూడిన కారు తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఆ కారులో దాదాపు 20 జిలెటిన్ స్టిక్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు అంబానీ ఇంటి సమీపంలో ఆ కారును పార్క్ చేసి వెళ్లారు. కారులో లభించిన లేఖలో.. 'ఇది ట్రైలర్ మాత్రమే...' అని అంబానీ దంపతులను వారు హెచ్చరించారు. అనేక మలుపులు తిరిగిన ఈ కేసును ప్రస్తుతం సీబీఐ దర్యాప్తు జరుపుతోంది. 

Also Read: Horoscope Today Feb 2 2022: నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారికి లవర్స్‌తో మనస్పర్థలు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News