మధ్యప్రదేశ్‌లోని సియోని జిల్లాలో ఓచోట గణపతి నిమజ్జనం ర్యాలీలో విషాదం చోటుచేసుకుంది. గణపతి నిమజ్జనం సందర్భంగా మండపం వద్ద నాగిని డ్యాన్స్ చేస్తోన్న ఓ వ్యక్తి అకస్మాత్తుగా కిందపడి మృతి చెందడం స్థానికులను షాక్‌కి గురిచేసింది. మరో ఇద్దరు భక్తులతో కలిసి నాగిని మ్యూజిక్‌కి అనుగుణంగా డ్యాన్స్ చేస్తోన్న వ్యక్తి ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు. ఏమైందా అని చుట్టూ ఉన్న వాళ్లు దగ్గరికి వెళ్లి చూసేలోపే అతడు మృతిచెందాడు. అతడి మృతికి వెనుకున్న కారణాలు ఇంకా తెలియరాలేదు.
ఈ ఘటనపై మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించిన మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్.. బాధితుడి కుటుంబానికి రూ.4 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించినట్టు తెలుస్తోంది.