మోదీ మూడేళ్లలో ఖర్చుపెట్టింది రూ.3,755 కోట్లు..!

ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక అంటే ఏప్రియల్ 2014 నుండి అక్టోబర్ 2017 వరకు ప్రచారాలు, ప్రకటనలు, పత్రికల కోసం అక్షరాలా రూ.3 వేల కోట్ల రూపాయలపైనే ఖర్చుచేసినట్లు ఆర్టీఐ తెలిపింది.

Last Updated : Dec 9, 2017, 07:12 PM IST
మోదీ మూడేళ్లలో ఖర్చుపెట్టింది రూ.3,755 కోట్లు..!

ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక.. అంటే ఏప్రియల్ 2014 నుండి అక్టోబర్ 2017 వరకు ప్రచారాలు, ప్రకటనల పేరుతో పత్రికల కోసం అక్షరాలా రూ.3 వేల కోట్ల రూపాయలకుపైనే ఖర్చుచేసినట్లు ఆర్టీఐ తెలిపింది. గ్రేటర్ నోయిడాకు చెందిన రాంవీర్ తన్వర్ అనే సామాజిక ఉద్యమకారుడు మోదీ ప్రచార ఆర్భాటాల కోసం మూడేళ్లలో ఎంత ఖర్చుపెట్టారో చెప్పాలంటూ ఆర్టీఐకు దరఖాస్తు పెట్టుకుంటే ఈ విషయం తెలిసింది. 

మోదీ ఏప్రియల్ 2014- అక్టోబర్ 2017 వరకు ప్రచార ఆర్భాటాలు కోసం ఖర్చు పెట్టింది రూ.37,54,06,23,616 కోట్లు. రేడియో ప్రకటనలు, డిజిటల్ మీడియా యాడ్స్, ఎస్సెమ్మెస్‌లు మాత్రమే కాకుండా.. దూరదర్శన్‌తో పాటు ఇతర ఎలక్ట్రానిక్ మీడియా ప్రకటనలకు రూ.1,656 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసింది. అలాగే... ప్రింట్ మీడియాలో ప్రకటనలకు రూ.1,698 కోట్లు.. పోస్టర్లు, ప్లెక్సీల వంటి బయటి ప్రచారాల కోసం రూ.399 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసిందని ఆర్టీఐ వెల్లడించింది. అయితే ప్రచారం కోసం ఖర్చు పెట్టిన డబ్బు.. బడ్జెట్‌లో పలు అభివృద్ధి పథకాలను మించిపోయిందని ఈ విషయం తెలిసిన పలువురు విమర్శించారు. 

Trending News