జమ్మూకాశ్మీర్: సాక్షాత్తూ రాష్ట్ర అసెంబ్లీలోనే 'జై పాకిస్థాన్' నినాదాలు ప్రతిధ్వనించాయి. ఓ ప్రజాప్రతినిధే ఈ నినాదాలు చేయడం గమనార్హం. ఈ సంఘటన జమ్మూకాశ్మీర్ రాష్ట్ర శాసనసభలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
జమ్మూ కాశ్మీర్‌లోని ఆర్మీ క్యాంపులపై జరుగుతున్న ఉగ్రదాడులను ఖండిస్తూ సభలో బీజేపీ ఎమ్మెల్యేలు పాకిస్థాన్ వ్యతిరేక నినాదాలు చేశారు. దీనికి ప్రతిగా నేషనల్ కాన్ఫరెన్స్ ఎమ్మెల్యే మహ్మద్ అక్బర్ లోన్ పాకిస్థాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. దీంతో సభలో ఒక్కసారిగా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అనంతరం సభ వాయిదా పడింది.
సభ వాయిదా పడిన అనంతరం ఎంఎల్ఏ మహ్మద్ అక్బర్ లోన్ విలేకరులతో మాట్లాడుతూ- బీజేపీ సభ్యులు పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తుంటే భావోద్వేగానికి లోనై పాక్ అనుకూల నినాదం చేశానని.. ఆ వ్యాఖ్యలను తన వ్యక్తిగతమని చెప్పుకున్నారు.
Yes, I said it. It is my personal view, I said it in the house and I don't think anyone should have a problem with it: National Conference MLA Akbar Lone on shouting 'Pakistan Zindabad' in J&K Assembly pic.twitter.com/JbiwNui0kj
— ANI (@ANI) February 10, 2018