Nipah Virus Cases: దేశాన్ని వణికిస్తున్న కొత్త వైరస్.. 5 కేసులు నమోదు, 700 మంది ఐసోలేషన్

కరోనా భారీ నుండి ఇప్పుడిప్పుడే బయటపడుతుంటే.. నిఫా వైరస్ కేరళలో కోరలు చాపుతుంది. ఇప్పటికే ఐదుగురికి సోకగా.. ఇందులో ఒక వ్యక్తి దాదాపుగా 706 మందిని కాంటాక్ట్ లిస్టులో ఉండటం కలవరానికి గురి చేస్తుంది. ఆ వివరాలు..   

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 14, 2023, 10:11 PM IST
Nipah Virus Cases: దేశాన్ని వణికిస్తున్న కొత్త వైరస్.. 5 కేసులు నమోదు, 700 మంది ఐసోలేషన్

Nipah Virus Cases: కేరళ రాష్ట్రాన్ని ఇప్పుడు నిఫా వైరస్ వణికిస్తోంది. తాజాగా మరో వ్యక్తి ఆ వైరస్ బారిన పడగా.. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఐదుగురికి ఈ ప్రమాదకర వైరస్ సోకినట్లు తేలింది. కోజీకోడ్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ 24 ఏళ్ల యువకుడికి ఈ వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం ఆ యువకుడు చికిత్స పొందుతున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. అయితే ఈ వైరస్ బారిన పడిన వారితో దాదాపుగా 706 మందిని కాంటాక్ట్ లిస్టులో అధికారులు చేర్చారు. వీరిలో 77 మందికి ముప్పు ఎక్కువగా ఉందని వారు వెల్లడించారు. అయితే ఇందులో 153 మంది హెల్త్ వర్కర్లే కావడం గమనార్హం. 13 మంది బాధితుల్లో స్వల్ప లక్షణాలు ఉన్నట్లు ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. 

ఇంట్లో నుంచి బయటకి రావొద్దు..
ఈ వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందిన ఎక్కువ రిస్కు గల ప్రాంతంలో నివసించే ప్రజలంతా.. ఇంట్లో నుంచి బయటకి రావొద్దని ప్రభుత్వం సూచించింది. ఆయా నిబంధనలను అమలు చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే 19 కోర్ కమిటీలను ఏర్పాటు చేసింది. వైరస్ బారిన పడిన లేదా ప్రత్యక్షంగా కాంటాక్ట్ పెట్టుకున్న వారంతా ఐసోలేషన్ కు తరలించగా.. వారికి నిత్యావసర సరుకులను అందజేసేందుకు కొందరు వాలంటీర్లు పనిచేస్తున్నారు. 

ఇద్దరు మరణం
కేరళలో నిఫా వైరస్ బారిన పడిన ఇద్దరు వ్యక్తులు ఇటీవలే మరణించారు. ఇప్పటికే ఏడు గ్రామ పంచాయితీల్లో కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించగా.. వాటిలో ఎలాంటి రాకపోకలు ఉండకూడదని.. కోజీకోడ్ జిల్లా కలెక్టర్ గీతా స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ఆతన్చేరి, మారుతోంకర, తిరువళ్లూరు, కుట్టియాడి, కాయక్కోడి, విల్యపల్లి, కవిలుంపర గ్రామాలు ఈ కంటైన్మెంట్ జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయా గ్రామాలపై పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచాలని కలెక్టర్ ఆదేశించారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే నిత్యావసర సరుకులను కొనుగోలు చేసేందుకు అనుమతి ఇచ్చారు. ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ దుకాణాలు మూసేయాల్సిందేనని ఆదేశారు జారీ చేశారు. 

Also Read: MLC Kavitha: ఈడీ నోటీసులను లైట్‌ తీసుకున్న ఎమ్మెల్సీ కవిత.. విచారణకు డుమ్మా..?   

నిఫా వైరస్ లక్షణాలు..
నిఫా వైరస్ సోకిన వారిలో ప్రధానంగా మెదడుపై ప్రభావం కనిపిస్తోంది. మెదడుకు ఇన్ఫెక్షన్ కలుగుజేసి.. మెదడువాపునకు కారణమవుతోంది. అందుకే తొలుత ఈ వైరస్ ను ఒకరకం మెదడువాపుగా భావించారు. ఈ వైరస్ ఒకసారి శరీరంలోకి ప్రవేశించిన తర్వాత సగటున 9 లేదా 14 రోజుల్లో లక్షణాలు కనిపిస్తాయి. మెదడువాపు కారణంగా తలనొప్పి కూడా వచ్చే అవకాశం ఉంది. విపరీతమైన తలనొప్పి కారణంగా 24 లేదా 48 గంటల్లో బాధితులు కోమాలోకి వెళ్లే అవకాశం ఉంది. 

వైరస్ ఎలా వ్యాప్తిస్తుంది..
నిఫా అనే వైరస్ ముఖ్యంగా జంతువుల నుంచి వ్యాపిస్తుంది. తాటి పండ్లలోని డేటా పాము చెట్లకు ఉండే పండ్లలో ఒక రకమైన గబ్బిలాల ద్వారా (ఫ్రూట్ బ్యాట్స్) ద్వారా వ్యాపిస్తుంది. తాటికాయలతో పాటు ఇతర పండ్లనూ ఈ గబ్బిలాలు తింటూ ఉంటాయి. జామ పండ్లు కొన్ని సగం కొరికని ఉన్నప్పుడు వాటిని చిలక కొట్టిన జామపండు అంటూ చాలామంది తింటూ ఉంటారు. కానీ, ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో గబ్బిలాలు కూడా పండ్లను సగం తిని వదిలేసే అవకాశం ఉంది. పండ్ల సాగుతో పాటు పందుల పెంపకం వంటి రంగంలో ఉన్న వారికి ఈ వైరస్ సోకే అవకాశం ఎక్కువ ఉంది.

Also Read: Birth Certificate: ఇక నుంచి బర్త్ సర్టిఫికెట్ చాలు గురూ.. అన్నింటికి సింగిల్ డాక్యుమెంట్‌గా..  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News