Congress: నోరు జారితే అంతే..పార్టీ నేతలకు కాంగ్రెస్ అధిష్టానం స్వీట్ వార్నింగ్..!

Congress: తదుపరి కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఈనేపథ్యంలో హస్తం నేతలకు ఆ పార్టీ అధిష్టానం కీలక ఆదేశాలు జారీ చేసింది. 

Written by - Alla Swamy | Last Updated : Sep 23, 2022, 03:52 PM IST
  • కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరన్న దానిపై ఆసక్తి
  • హస్తం నేతలకు ఆ పార్టీ అధిష్టానం కీలక ఆదేశాలు
  • త్వరలో అధ్యక్ష ఎన్నికలు
Congress: నోరు జారితే అంతే..పార్టీ నేతలకు కాంగ్రెస్ అధిష్టానం స్వీట్ వార్నింగ్..!

Congress: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలపై ఉత్కంఠ కొనసాగుతోంది. బరిలో నిలిచే వారి పేర్లు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఏఐసీసీ చీఫ్‌ పదవికి సీనియర్ నేత శశిథరూర్ పోటీ చేయనున్నారని తెలుస్తోంది. దీనిని ఆ పార్టీ నేతలు బహిరంగంగానే తప్పు పడుతున్నారు. ఆయనపై ఆ పార్టీ నేత గౌరవ్ వల్లబ్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఈనేపథ్యంలో అంతర్గత విభేదాలకు దారి తీస్తోంది. దీంతో ఆ పార్టీ అధిష్టానం రంగంలోకి దిగింది. 

అధ్యక్ష ఎన్నికలు, పోటీ చేసే అభ్యర్థుల విషయంలో పార్టీ నేతలెవరూ అతిగా మాట్లాడొద్దని హెచ్చరించింది. పార్టీ అధిష్టానం సూచనలతో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ, కమ్యూనికేషన్స్ ఇన్‌ఛార్జ్ జైరాం రమేష్‌..పార్టీ అధికార ప్రతినిధులు, ఆఫీస్ బేరర్లకు సందేశం పంపారు. ఈ విషయాన్ని ఆ పార్టీ వర్గాలే వెల్లడించాయి. అధ్యక్ష పదవికి పోటీ చేసే అభ్యర్థులపై ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని అందులో పేర్కొన్నారని కాంగ్రెస్ నేతలు తెలిపారు. 

నేతలందరికీ వ్యక్తిగత అభిప్రాయాలు, ప్రాధాన్యాలు ఉంటాయని..కానీ పార్టీ పరంగా అందరీ బాధ్యత ఒక్కటేనన్నారు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కమ్యూనికేషన్స్ ఇన్‌ఛార్జ్ జైరాం రమేష్‌. అధ్యక్ష ఎన్నికల్లో ప్రజాస్వామ్య, పారదర్శక వ్యవస్థను కల్గి ఉన్న ఏకైక రాజకీయ పార్టీ తమదని స్పష్టం చేశారు. దీనిని కలిసికట్టుగా చాటాలని పిలుపునిచ్చారు. అధ్యక్ష పదవికి పోటీ చేసే ఏ అభ్యర్థికైనా నామినేషన్‌ వేసేందుకు పది మంది పీసీసీ ప్రతినిధుల మద్దతు ఉంటే సరిపోతుందన్నారు.

ఇందుకు ఇంకెవరి అనుమతులు అవసరం లేదని స్పష్టం చేశారు. ఎన్నికలు పారదర్శకంగా జరిగేలా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందని పార్టీ నేతలకు ఆయన సూచించారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి శశిథరూర్, దిగ్విజయ్ సింగ్ పోటీ చేయబోతున్నారని గతకొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఈక్రమంలోనే ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీని ఇరువురు కలిశారు. దీంతో వారు పోటీ చేయడం ఖాయమని తేలిపోయింది. ఈనేపథ్యంలో చాలా మంది కాంగ్రెస్ నేతలు..శశిథరూర్‌పై విమర్శలు గుప్పించారు. 

జీ23 నేతల లేఖను ప్రస్తావిస్తూ థరూర్‌ను ఆ పార్టీ నేత గౌరవ్ వల్లభ్ విమర్శించారు. అదే సమయంలో మరో నేత అశోక్ గహ్లోత్‌కు మద్దతు తెలిపారు. గత 8 ఏళ్లలో శశిథరూర్ పార్టీ కోసం చేసిన ఏకైక సహకారం..సోనియా ఆస్పత్రిలో ఉన్నప్పుడు ఆమెకు లేఖ రాయడమేనని చెప్పారు. ఇది తనలాంటి ఎంతో మంది పార్టీ కార్యకర్తలకు ఆవేదన కల్గించిందన్నారు. గహ్లోత్‌ మాత్రం మూడు సార్లు సీఎంగా, ఐదు సార్లు ఎంపీగా పనిచేశారని గుర్తు చేశారు. 

మోదీ, అమిత్ షా ద్వయాన్ని ధైర్యం ఎదుర్కొన్నారని తెలిపారు. అధ్యక్ష ఎన్నికల్లో ఎవరికీ ఓటు వేయాలన్న క్లారిటీ అందరిలో ఉందన్నారు. ఈవ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. రంగంలోకి దిగిన కాంగ్రెస్ అధిష్టానం దిద్దుబాటు చర్యలకు దిగింది. ఈనెల 24 నుంచి అధ్యక్ష ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ మొదలవుతుంది. ఒకరు కంటే ఎక్కువ మంది పోటీలో ఉంటే అక్టోబర్ 17 ఎన్నికలు జరగనున్నాయి. ఈ పదవికి పలువురు సీనియర్ నేతలు పోటీ పడుతున్నారు. 

Also read:TS Jobs: తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్..త్వరలో మరో నోటిఫికేషన్..!

Also read:SBI Jobs: బ్యాంక్ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న నిరుద్యోగులకు శుభవార్త..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News