ఒడిషా సీఎంకు ప్రధాని మోడీ పరామర్శ; తుపాను బాధితులకు అండగా ఉంటామని హామీ

తుపాను వల్ల తీవ్రంగా నష్టపోయిన ఒడిషా ప్రాంతానికి అండగా ఉంటామని ప్రధాని మోడీ భరోసా ఇచ్చారు

Last Updated : May 4, 2019, 09:42 AM IST
ఒడిషా సీఎంకు ప్రధాని మోడీ పరామర్శ; తుపాను బాధితులకు అండగా ఉంటామని హామీ

ఫొని తుపాను  బీభత్సంతో  ఒడిషా రాష్ట్రం తీవ్రంగా  నష్టపోగా.. ఏపీ, జార్ఖండ్, బెంగాల్ తదితర ప్రాంతాలు కూడా పరిమిత స్థాయిలో నష్టపోయాయి. ఈ నేపథ్యంలో ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ తో ప్రధాని మోడీ ఫోన్ లో మాట్లాడారు. ఈ సందర్భంగా తుపాను అనంతరం ఏర్పడిన పరిస్థితులు, నష్టాల గురించి అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా తుపాను బాధితులను కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తుందని ప్రధాని మోడీ హామీ ఇచ్చారు. ఇదే సందర్భంలో యావత్ భారత జాతీ తుపాను బాధితులకు పక్షాన ఉందని ఈ సందర్భంగా ప్రధాని మోడీ అభయమిచ్చారు

ఫొనీ తుపాను వల్ల ఏపీ కూడా నష్టాన్ని చవిచూసింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలోని 14 మండలు తుపాను వల్ల నష్టపోయింది. వేల ఎకరాల పంట నష్టంతో పాటు వందల ఇళ్ల పాక్షికంగా దెబ్బతీన్నాయి .ఈ నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తన వంతు సహాయక చర్యలు చేపట్టింది. ఇదే క్రమంలో తుపాను బాధితులను ఆదుకోవాల్సిందిగా కేంద్రాన్ని కోరింది.
 

Trending News