హైదరాబాద్: ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్ సమస్యలకు సంబంధించి అన్ని రాజకీయ పార్టీలతో త్వరలో జరగనున్న వీడియో కాన్ఫరెన్స్‌కు ప్రధాని నరేంద్ర మోదీ తనను ఆహ్వానించకపోవడం హైదరాబాద్, ఔరంగాబాద్ ప్రజలను అవమానించడమేనన్నారు. ఏఐఎంఐఎం పార్టీ నేతను ఆ వీడియో కాన్ఫరెన్స్‌కు ఆహ్వానించకపోవడం తమ ప్రజలను అవమానించినట్టేనని అసదుద్దీన్ పేర్కొన్నారు. తొడలు లావుగా ఉన్నాయా.. ఇది చదవండి
‘వీళ్లకు అంతగా విలువ లేదు. ఎందుకంటే ఆ ప్రజలు ఏఐఎంఐఎం పార్టీతో ఉన్నారు. మిగతా ప్రజలతో పోల్చితే వీరు ఎందుకంత తక్కువ భావం ఉందో చెప్పాలి. ఎంపీలుగా మా ప్రజల ఆర్థిక, సామాజిక స్థితిగతులను కేంద్రానికి చేరవేయాల్సిన బాధ్యత మాపై ఉంటుందని’ ప్రధాన మంత్రి కార్యాలయం ట్విట్టర్ ఖాతాకు అసదుద్దీన్ ట్వీట్ చేశారు. ప్రపంచంలోనే హాట్ మోడల్ Bikini Photos
హైదరాబాద్, ఔరంగబాద్ ప్రజలు తనను, ఇంతియాజ్ జలీల్‌ను ఎన్నుకున్నారని.. ఈ ప్రజల సమస్యలకు గొంతుక తామేనని చెప్పారు. హైదరాబాద్‌లోనే 93 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని, కరోనాపై పోరాటానికి సంబంధించి తన వద్ద కొన్ని సలహాలు, సూచనలున్నాయన్నారు. అయితే కనీసం తమ అభిప్రాయాల్ని తెలుసుకునే ప్రయత్నం కూడా కేంద్ర ప్రభుత్వం చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాత్రికి కరోనా ఖతమ్.. Corona ఫన్నీ మీమ్స్
కాగా, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి విడుదల చేసిన పత్రికా ప్రకటనను సైతం అసదుద్దీన్ ఒవైసీ పోస్ట్ చేశారు. దీని ప్రకారం.. 5 కంటే ఎక్కువ మంది ఎంపీల (రాజ్యసభ, లోక్‌సభ)ను కలిగి ఉన్న రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్‌లతో ఏప్రిల్ 8న ప్రధాని నరేంద్ర మోదీ కరోనా సమస్యలు, పరిస్థితులపై వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొననున్నారు. ఎంఐఎం పార్టీకి లోక్‌సభలో ఇద్దరు ఎంపీలుండగా, రాజ్యసభలో ప్రాతినిధ్యం లేదని తెలిసిందే. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
Photos: బికినీలో ‘సాహో’ బ్యూటీ