PM Modi: గ్లోబల్ మాన్యుఫాక్చరింగ్ హబ్ గా భారత్.. బడ్జెట్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మోదీ.. వీడియో ఇదే..

Union budget 2024-25: కేంద్ర ఆర్థిక మంత్రి  నిర్మలా సీతారామన్  ఈరోజు (జులై 23)  లోక్ సభలో వార్షిక బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. ఈ నేపథ్యంలో బడ్జెట్ పై మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  

Written by - Inamdar Paresh | Last Updated : Jul 23, 2024, 04:29 PM IST
  • బడ్జెట్ లో యువతకు పెద్దపీట..
  • డిఫెన్స్ కోసం కూడా పలు మార్పులు..
PM Modi: గ్లోబల్ మాన్యుఫాక్చరింగ్ హబ్ గా భారత్.. బడ్జెట్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మోదీ.. వీడియో ఇదే..

Pm Narendra modi interesting comments on union budget 2024-25: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం (జులై 23) వార్షిక బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. ఈ నేపథ్యంలో దీనిపై ప్రధాన మంత్రి మోదీ స్పందించారు.  ప్రస్తుతం ప్రవేష పెట్టిన బడ్జెట్ మధ్యతరగతి ప్రజలకు భరోసాను ఇచ్చే బడ్జెట్ అని అన్నారు. దళితులు, అణగారిన వర్గాలకు  భరోసాను ఇచ్చే బడ్జెట్ అన్నారు. మహిళల స్వావలంబన, ఎంఎస్ఎంఈల డెవలప్ మెంట్ కు కొత్త బాటలు వేశామన్నారు. ఉద్యోగ కల్పన, ఉపాధి అవకాశాలపై అనేక మార్పులు చేశామన్నారు.  కొత్త ఉద్యోగులకు తొలిజీతం తమ ప్రభుత్వమే ఇస్తుందన్నారు.స్కిల్ డెవలప్ మెంట్ కు పెద్ద పీట వేశామన్నారు. దేశ ఆర్థికాభివృద్ధికి కొత్త పుంతలు తొక్కించే విధంగా బడ్జెట్ ఉందడి కూడా మోదీ కొనియాడారు.  

 

యువతకు దీని వల్ల మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. యువత నైపుణ్యాలను పెంచే బడ్జెట్ అని తెలిపారు. సమాజంలోని అన్ని వర్గాలకు సాధికారత కల్పించినట్టు చెప్పారు.  గత పదేళ్లలో 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి విముక్తులయ్యారు. మధ్యతరగతి ప్రజలకు ఈ బడ్జెట్ ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నారు.  గిరిజనులు, దళితులు, వెనుకబడిన తరగతుల సాధికారతకు  అన్నిరకాలుగా చర్యలు తీసుకున్నామన్నారు.  ముద్ర రుణాలను రూ.20 లక్షలకు పెంచామని, భారత్‌ను గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా మార్చడమే తమ టార్గెట్ అన్నారు.

ఉపాధి కల్పన, రైతులు, యువత, మహిళలు, పెద, మధ్యతరగతి ప్రజల సంక్షేమంపై బడ్జెట్ లో పెద్దపీట వేశామన్నారు. పన్నుల తగ్గింపు, టీడీఎస్ నిబంధనలను సరళతరం చేసేందుకు నిర్ణయం తీసుకున్నాం. రక్షణరంగం స్వయం సమృద్ధి సాధించేందుకు బడ్జెట్‌లో అనేక మార్పులు చేశామన్నారు. అదే విధంగా.. పర్యాటక రంగంపై ప్రత్యేకంగా దృష్టి సారించామని మోదీ వెల్లడించారు. బంగాం,వెండి, ప్లాటినమ్ వంటి వాటిపై దిగుమతి సుంకాలను తగ్గించారు. 

Read more:Aadhaar Card: ఆధార్‌ కార్డుపై పేరు, అడ్రస్‌, పుట్టినతేదీని ఎన్నిసార్లు మార్చుకోవచ్చు? ఈ రూల్స్‌ తెలుసుకోండి..

క్యాన్సర్  మెడిసిన్స్, మొబైల్ ఫోన్స్, సీఫుడ్, సోలార్ ఎనర్జీ భాగాలు, పుట్ వేర్ వంటి వాటిపై భారీగా సుంకాన్ని తగ్గించిట్లు మోదీ పేర్కొన్నారు. స్టార్టప్ లను ప్రొత్సహించే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. స్టాండర్డ్ డిడక్షన్ పెంచినట్లు తెలుస్తోంది. కేంద్ర బడ్జెట్ లో డిడక్షన్ రూ.50 నుంచి రూ.75 వేలకు పెంచారు. అదే విధంగా పాతపన్ను విధానంలో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు. మరోవైపు.. LTCG పై పన్నును 10% నుంచి 12.5% కి పెంచగా, STCGని 15% నుంచి 20%కి పెంచారు. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News