బీహార్ రాజధాని పాట్నాలో పోలీసు ఉద్యోగాల కోసం పోరాడుతున్న యువత ఆందోళనకు దిగారు. పాట్నాలోని సైన్స్ కాలేజీ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. గతంలో వీరంతా పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఐతే పోలీసు కానిస్టేబుల్ రాతపరీక్షలో అవకతవకలు జరిగాయి. పేపర్ లీకైందన్న వార్తలు వినిపించాయి. దీంతో పరీక్షను వాయిదా వేశారు. ఈ కేసులో పరీక్ష పేపర్ లీక్ చేసిన వారిని అరెస్టు చేయాలని ఉద్యోగార్థులు డిమాండ్ చేస్తున్నారు. అంతే కాదు .. ఈ మొత్తం ఘటనపై సీబీఐ ద్వారా విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇందుకోసం పాట్నాలో నిరసనలు కొనసాగిస్తున్నారు. ఐతే పోలీసులు వారిని అడ్డుకున్నారు.
ఆందోళన సందర్భంగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. దీంతో ఇరు వర్గాల మధ్య మాటామాటా పెరిగింది. పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీఛార్జీ చేశారు. వాటర్ కేనన్లతో చెదరగొట్టారు. ఈ ఘటనలో పలువురు ఆందోళనకారులకు గాయాలయ్యాయి. బీహార్ లో పోలీసు కానిస్టేబుళ్ల రాత పరీక్ష కోసం దాదాపు 6 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. పరీక్ష పేపర్ లీక్ కావడంతో పరీక్షను వాయిదా వేశారు.
#WATCH Bihar: Police resort to lathi-charge & use water cannons on protestors who are demonstrating near Science college in Patna. Protestors are the candidates who appeared for Bihar Police Examination and allege that paper was leaked and are demanding CBI investigation. pic.twitter.com/CrdlMiR14S
— ANI (@ANI) February 4, 2020