PM Mudra Yojana: రూ.4,500 చెల్లిస్తే కేంద్ర ప్రభుత్వం రూ.10 లక్షల రుణం.. ఆ లెటర్‌పై క్లారిటీ

PM Mudra Loan Online Apply: రూ.4500 చెల్లిస్తే.. రూ.10 లక్షల రుణం క్షణాల్లో పొందండి. ఇలాంటి లెటర్ మీ దృష్టికి కూడా వచ్చిందా..? దీనిపై ప్రెస్ ఇన్‌ఫర్మేషన్ బ్యూటీ క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు ట్విట్టర్ లో లేఖను పోస్ట్ చేసింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 27, 2022, 03:49 PM IST
PM Mudra Yojana: రూ.4,500 చెల్లిస్తే కేంద్ర ప్రభుత్వం రూ.10 లక్షల రుణం.. ఆ లెటర్‌పై క్లారిటీ

PM Mudra Loan Online Apply: ప్రస్తుతం బ్యాంకింగ్ వ్యవస్థలో చాలా పెద్ద మార్పులు వచ్చాయి. పెరుగుతున్న డిజిటలైజేషన్ ప్రభావంతో బ్యాంకింగ్ సేవలు కూడా డిజిటల్‌గా మారాయి. ఈ రోజుల్లో వినియోగదారులకు ఆన్‌లైన్‌లో రుణాలు సులభంగా అందుబాటులో ఉన్నాయి. అయితే పెరుగుతున్న ఇంటర్నెట్ వాడకంతో సైబర్ మోసాల కేసులు కూడా వేగంగా పెరిగాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ లేఖ చాలా వేగంగా వైరల్ అవుతోంది. ఈ లేఖలో ప్రధాన మంత్రి ముద్రా లోన్ ద్వారా 10 లక్షల రూపాయలకు రూ.4500 చెల్లించాలని ఉంది.

ప్రధాన మంత్రి ముద్రా యోజన (PMMY) పథకం కింద కార్పొరేట్‌యేతర, వ్యవసాయేతర చిన్న/సూక్ష్మ పరిశ్రమలకు రూ.10 లక్షల వరకు రుణాలు అందిస్తున్న విషయం తెలిసిందే. 2015 సంవత్సరంలో ప్రారంభించిన ఈ పథకం కింద ఎంతోమంది లబ్ధిపొందారు. వాణిజ్య బ్యాంకులు, ఆర్‌ఆర్‌బీలు, చిన్న ఫైనాన్స్ బ్యాంకులు, సహకార బ్యాంకులు, ఎమ్‌ఎఫ్ఐలు, ఎన్‌బీఎఫ్‌సీల లోన్లు అందజేస్తున్నారు. లోన్ కావాలనుకున్న వారు వీటిలో ఎక్కడైనా సంప్రదించి దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 

ఇటీవల ప్రధాన మంత్రి ముద్రా యోజనకు సంబంధించి సోషల్ మీడియాలో కూడా ఓ లేఖ బాగా వైరల్ అవుతోంది. పీఎంఎంవై పేరుతో ఉన్న ఈ లేఖపై ప్రధానమంత్రి ఫొటోను కూడా ముద్రించారు. ప్రధానమంత్రి ముద్రా యోజన కింద రూ.10 లక్షల రుణం కోసం కేవలం వెరిఫికేషన్, ప్రాసెసింగ్ కోసం రూ.4500 చెల్లిస్తే సరిపోతుందని లేఖలో ఉంది. కేవలం కొన్ని నిమిషాల్లోనే మీ ఖాతాలో నగదు జమ అవుతుందని పేర్కొన్నారు. 

ఈ లేఖపై ప్రెస్ ఇన్‌ఫర్మేషన్ బ్యూటీ క్లారిటీ ఇచ్చింది. 'ప్రధానమంత్రి ముద్రా యోజన పథకం కోసం రూ.4500 చెల్లించాలని వైరల్ అవుతున్న లేఖ ఫేక్ అని స్పష్టం చేసింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ లేఖను జారీ చేయలేదని పీఐబీ ఫాక్ట్ చెక్ తెలిపింది. ఈ మేరకు లేఖను జత చేస్తూ ట్వీట్ చేసింది. మీకు ఇలాంటి లేఖకు సంబంధించి మెసేజ్ లేదా ఈ మెయిల్ వచ్చినట్లయితే దానిని నమ్మకండి. 

Also Read:  Gujarat Election: 20 లక్షల ఉద్యోగాలు.. బాలికలకు ఎలక్ట్రిక్ స్కూటీలు.. గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ హామీల వర్షం  

Also Read:  SSMB 28: అదిరిందయ్యా త్రివిక్రమ్.. మహేష్ బాబు సినిమా కోసం ఏకంగా 4 హీరోయిన్లు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News