Priyanka Gandhi's new Bag: కాంగ్రెస్ సీనియర్ నేత, వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ పార్లమెంట్ వద్ద అందరి ద్రుష్టిని ఆకర్షించారు. ఆమె ధరించిన బ్యాగు పై కూడా వివాదం నెలకొంది. సోమవారం నాడు పార్లమెంట్ కు పాలస్తీనా అని రాసి ఉన్న బ్యాగు వేసుకుని వచ్చిన ప్రియాంక..నేడు బంగ్లాదేశ్ అని రాసి ఉన్న బ్యాగుతో పార్లమెంట్ కు వచ్చారు. బంగ్లాదేశ్‌లోని హిందువులతో సహా మైనారిటీ వర్గాలపై జరుగుతున్న అకృత్యాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రాతో పాటు పలువురు ప్రతిపక్ష ఎంపీలు మంగళవారం పార్లమెంట్ కాంప్లెక్స్‌లో ప్రదర్శన నిర్వహించారు. ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రియాంక గాంధీతోపాటు అక్కడున్న ఎంపీలు కూడా తమ చేతుల్లో బ్యాగులు పట్టుకుని ఉన్నారు. ఆ బ్యాగులపై స్టాండ్ విత్ హిందువులు, బంగ్లాదేశ్ క్రైస్తవులు అని రాసి ఉంది.
ప్రియాంక గాంధీతో పాటు పలువురు ఎంపీలు పార్లమెంట్ హౌస్‌లోని 'మకర్ ద్వార్' దగ్గర గుమిగూడి 'కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి', 'మాకు న్యాయం కావాలి' అంటూ నినాదాలు చేశారు. అంతకుముందు సోమవారం కూడా కాంగ్రెస్ ఈ అంశంపై పార్లమెంట్ కాంప్లెక్స్‌లో ధర్నా చేసింది. ప్రియాంక గాంధీ కూడా లోక్‌సభలో జీరో అవర్‌లో ఈ అంశాన్ని లేవనెత్తారు.
बांग्लादेश में अल्पसंख्यकों, हिंदुओं और ईसाइयों पर अत्याचार की घटनाएं लगातार सामने आ रही हैं।
लेकिन मोदी सरकार इस मुद्दे पर खामोश है, कोई कदम नहीं उठा रही।
आज संसद परिसर में कांग्रेस के सांसदों ने प्रदर्शन कर, बांग्लादेश में हिंदुओं, ईसाइयों व अल्पसंख्यकों के संरक्षण की मांग… pic.twitter.com/L0EeofTcLI
— Congress (@INCIndia) December 17, 2024
పాలస్తీనా ప్రజలకు మద్దతుగా పాలస్తీనా అని రాసి ఉన్న హ్యాండ్‌బ్యాగ్‌తో ఆమె సోమవారం పార్లమెంటుకు చేరుకున్నారు.పాలస్తీనా హ్యాండ్‌బ్యాగ్‌పై బీజేపీ ఎంపీలు నిరసన తెలిపారు. బీజేపీ ఎంపీలకు విమర్శలకు ప్రియాంకగాంధీ గట్టిగా సమాధానం ఇచ్చారు.
నేను ఎలాంటి బట్టలు వేసుకోవాలని నిర్ణయించడానికి మీరెవరు అంటూ ఫైర్ అయ్యారు. తనకు నచ్చినవి వేసుకుంటానని ప్రియాంక స్పష్టం చేశారు. నేను ఎలాంటి బట్టలు వేసుకోవాలో చెప్పేందుకు మీరెవరు అంటూ ప్రశ్నించారు. మీలాంటి పురుషహంకారులే మహిళలు ఏం ధరించాలో నిర్ణయిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను లాంటి వారి గురించి అస్సలు పట్టించుకోను. నాకు నచ్చిన విధంగా నేను ఉంటాను. నా నమ్మకాలు నాకు ఉన్నాయి. వాటి గురించి చాలా సార్లు చెప్పారు. వీటి గురించి తెలుసుకోవాలంటే నా ట్విట్టర్ అకౌంట్లో చేసే పోస్టులు చూడండి అంటూ బీజేపీ విమర్శలకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు ప్రియాంక గాంధీ.
కాగా నేడు ప్రియాంక గాంధీ 'స్టాండ్ విత్ హిందువులు, బంగ్లాదేశ్ క్రైస్తవులు' అని రాసి ఉన్న క్రీమ్ కలర్ హ్యాండ్‌బ్యాగ్‌తో పార్లమెంటుకు వచ్చారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook