Rahul Gandhi: భారత రాజకీయాల్లో ప్రేమ, గౌరవాలు లేవు.. ప్రధాని మోడీపై రాహుల్ సంచలన వ్యాఖ్యలు..

Rahul Gandhi: ప్రస్తుతం భారత దేశ రాజకీయాలపై లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు ప్రస్తుతం దేశ రాజకీయాల్లో ప్రేమ, గౌరవాలు లేవంటూ ప్రధాని నరేంద్ర మోడీ నియంతలా వ్యవహరిస్తున్నరంటూ  అమెరికన్ గడ్డ నుంచి సంచలన వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ గా మారింది.

Written by - TA Kiran Kumar | Last Updated : Sep 9, 2024, 12:45 PM IST
Rahul Gandhi: భారత రాజకీయాల్లో ప్రేమ, గౌరవాలు లేవు.. ప్రధాని మోడీపై రాహుల్ సంచలన వ్యాఖ్యలు..

Rahul Gandhi: కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ విదేశీ గడ్డపై నుంచి భారత దేశ రాజకీయాలతో పాటు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై సంచలన వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. మన దేశంలో ప్రధాన మంత్రి మంచి చేసిన విమర్శించే రాహుల్ గాంధీ ఎక్కడో సప్త సముద్రాల ఆవల ఉన్న అమెరికాలో ఈ వ్యాఖ్యలు చేయడం ఇపుడు దేశ రాజకీయాల్లో హీట్ పుట్టిస్తున్నాయి. అమెరికాలోని టెక్సాస్ లోని భారత - అమెరికన్ కమ్యూనిటితో  చిట్ చాట్ నిర్వహించారు. భారత దేశ రాజకీయాల్లో ప్రస్తుతం ప్రేమ, గౌరవం , వినయం లాంటివి ఇసుమంతైన లేవన్నారు.  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాజ్యాంగంపై దాడి చేస్తున్నారని అందరికీ అర్థమైందన్నారు రాహుల్ గాంధీ.

రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ అంతే స్థాయిలో విరుచుకు పడింది. ఎక్కడో నిరుపేద కుటుంబంలో టీ అమ్ముకునే స్థాయి వ్యక్తి ప్రధాన మంత్రి పదవి చేపట్టడాన్ని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతుందన్నారు. అది వారి ఫ్యూడల్ మనస్తత్వాన్ని తెలియజేస్తుందన్నారు. విదేశీ గడ్డపై కూడా భారత దేశంపై మరోసారి తన అక్కసు వెల్లగక్కడని విమర్శించారు.
 ఎంతో మంది ఆడ పడుచులకు మరుగు దొడ్లతో పాటు వంట గ్యాస్ ఇచ్చిన ఘనత మోడీది అన్నారు. ఎంతో మంది జన్ ధన్ ఖాతాలతో పాటు.. ఫసల్ భీమా యోజన, అటల్ పెన్షన్ యోజన సహా.. ముద్రా రుణాలు సహా భారత దేశ పేదల గురించి నిరంతరం తపిస్తున్న నేత నరేంద్ర మోడీ.

అంతేకాదు మన దేశ ఆర్ధిక వ్యవస్థను ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా తీర్చిదిద్దిన ఘనత నరేంద్ర మోడీది అన్నారు. రాహుల్ గాంధీ విషయానికొస్తే.. గత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 99 సీట్లను గెలచుకొని లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష  హోదా పొందింది. గత రెండు పర్యాయాలు కాంగ్రెస్  పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కలేదు.

గత ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఉత్తర ప్రదేశ్ లోని రాయబరేలి తో పాటు కేరళలోని వాయనాడ్ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. దీంతో వాయనాడ్ లోక్ సభ స్థానానికి రాజీనామా చేసారు. ప్రస్తుతం అక్కడ ప్రకృతి విపత్తుల నేపథ్యంలో అక్కడ ఉప ఎన్నికలు నిర్వహించాలేదు. అంతా ఓకే అయ్యాకా అక్కడ లోక్ సభకు సంబంధించిన ఎన్నికను నిర్వహించారు. రీసెంట్ గా కాంగ్రెస్ పార్టీకి చెందిన మహారాష్ట్ర ఓ లోక్ సభ సభ్యుడు మరణంతో ఓ సీటు ఖాళీ అయింది. ప్రస్తుతం లోక్ సభలో కాంగ్రెస్ పార్టీకి 97 మంది ఎంపీలున్నారు. ప్రస్తుతం లోక్ సభ అపోజిషన్ లీడర్ గా రాహుల్ గాంధీ ఉన్నారు.  రాజ్యసభలో మల్లిఖార్జున ఖర్గే కాంగ్రెస్  పార్టీ నేతగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేతగా.. ఇండి కూటమి పార్లమెంటరీ నేతగా సోనియా గాంధీ ఉన్నారు.

ఇదీ చదవండి:  పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజ్నెవా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తెలుసా..!

ఇదీ చదవండి:  పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకోవడానికి కారణమేమిటంటే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News