రాహుల్ చేతికే ఇక కాంగ్రెస్ పార్టీ పగ్గాలు..!

భారత జాతీయ కాంగ్రెస్‌కు ప్రస్తుతం ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్న రాహుల్ గాంధీకే పూర్తిగా పార్టీ పగ్గాలు అప్పజెప్పనున్నట్లు ప్రసుత్త పార్టీ ప్రెసిడెంట్ సోనియా గాంధీ ప్రకటించారు.

Last Updated : Oct 14, 2017, 02:53 PM IST
రాహుల్ చేతికే ఇక కాంగ్రెస్ పార్టీ పగ్గాలు..!

భారత జాతీయ కాంగ్రెస్‌కు ప్రస్తుతం ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్న రాహుల్ గాంధీకే పూర్తిగా పార్టీ పగ్గాలు అప్పజెప్పనున్నట్లు ప్రసుత్త పార్టీ ప్రెసిడెంట్ సోనియా గాంధీ ప్రకటించారు. ఈ నెల 19వ తేదీ తర్వాత  పార్టీకి సంబంధించి పలు కీలక మార్పులు జరగనున్నట్లు ఆమె తెలిపారు. ఈ క్రమంలో 2019 లోక్ సభ ఎన్నికలను పరిగణనలోకి తీసుకొనే, కాంగ్రెసు పార్టీకి సంబంధించి పలు విప్లవాత్మకమైన మార్పులు చేపట్టే అవకాశం ఉందని పలువురు పార్టీ ప్రముఖులు భావిస్తున్నారు.అందులో భాగంగానే, తొలుత రాహుల్‌ను పార్టీ ప్రెసిడెంట్‌ చేయడానికి అధిష్టానం నిశ్చయించిందని వారు అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో మాజీ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ప్రణబ్ ముఖర్జీకి సంబంధించిన ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సోనియా గాంధీ, పార్టీ ప్రెసిడెంటును ప్రకటించే విషయంపై తన మనసులో మాటను బయటపెట్టారు. అయితే, అదే సభలో ఉన్న రాహుల్ ఈ విషయంపై స్పందించడానికి నిరాకరించారు. కాంగ్రెసు పార్టీ  నాయకుడు సచిన్ పైలట్ కూడా కొద్ది రోజుల క్రితం ఇదే విషయం మీద మాట్లాడుతూ, రాహుల్‌ను ప్రెసిడెంట్ చేయడానికి పార్టీ అంతర్గత కమిటీలు భావిస్తున్నాయని చెప్పడం గమనార్హం. 

Trending News