SBI Alert: అలా చేస్తే...మీ ఎక్కౌంట్ ఖాళీ అవుతుంది..ఈ టిప్స్ పాటించండి

మోసం ఎప్పుడు ఏ రూపం సంతరించుకుంటుందో తెలియదు. మోసపోయేవరకూ మోసపోయామని కూడా తెలియనంతగా ఉంటుంది. అందుకే ఎస్బీఐ ఇప్పుడు హెచ్చరిస్తోంది. పొరపాటున మీరలా చేశారా...ఇక అంతే సంగతులు మీ ఎక్కౌంట్ ఖాళీ అయిపోతుంది మరి..

Last Updated : Nov 12, 2020, 05:04 PM IST
SBI Alert: అలా చేస్తే...మీ ఎక్కౌంట్ ఖాళీ అవుతుంది..ఈ టిప్స్ పాటించండి

మోసం ఎప్పుడు ఏ రూపం సంతరించుకుంటుందో తెలియదు. మోసపోయేవరకూ మోసపోయామని కూడా తెలియనంతగా ఉంటుంది. అందుకే ఎస్బీఐ ఇప్పుడు హెచ్చరిస్తోంది. పొరపాటున మీరలా చేశారా...ఇక అంతే సంగతులు మీ ఎక్కౌంట్ ఖాళీ అయిపోతుంది మరి..

అందుకే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( State bank of india ) సోషల్ మీడియాలో వస్తున్న ఫేక్‌న్యూస్ పై వినియోగదార్లను అప్రమత్తం చేస్తుంది.  ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో వివిధ రకాల తప్పుడు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ మీరు ఆ వలలో చిక్కుకుంటే మాత్రం బ్యాంకింగ్ ఫ్రాడ్‌కు‌ బలైపోతారు. అందుకే ఇలాంటి తప్పుడు మెస్సేజెస్ నుంచి దూరంగా ఉండమని ఎస్బీఐ హెచ్చరిస్తోంది. ఎందుకంటే సోషల్ మీడియాలో వస్తున్నటువంటి మెస్సేజెస్‌ను ఎస్బీఐ ఎప్పుడూ పంపించదని అంటోంది. 

సోషల్ మీడియా ( Social media ) లో వస్తున్న తప్పుడు సందేశాల్నించి జాగ్రత్తగా ఉండాల్సిందిగా ఎస్బీఐ ట్వీట్ చేసింది. తప్పుడు మెస్సెజెస్, తప్పుడు సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండకపోతే.. మీ బ్యాంకు ఖాతా ఖాళీ అయిపోతుందని ఎస్బీఐ నేరుగా వినియోగదార్లను హెచ్చరిస్తోంది. Also read: COVISHIELD 3వ దశ క్లినికల్ ట్రయల్స్‌కు ఎన్‌రోల్ ప్రక్రియ పూర్తి

వినియోగదార్లను అప్రమత్తం చేసేందుకు ప్రణాళిక ప్రకారం ముందుకుపోతున్నామని ఎస్బీఐ ట్వీట్ ద్వారా స్పష్టం చేసింది. సోషల్ మీడియాపై ఎస్బీఐని విజిట్ చేసినప్పుడు బ్లూ టిక్  ( Blue tick ) ఉంటే అది అసలైన అక్కౌంట్‌గా భావించాలని..ఇది కాకుండా మిగిలినవి ఏవి కన్పించినా అందులో తమ వ్యక్తిగత సమాచారం నమోదు చేయవద్దని చెబుతోంది. అలా చేస్తే  తమ ఎక్కౌంట్‌లోని డబ్బు మాయమవుతుందని హెచ్చరిస్తోంది. అక్కౌంట్ నెంబర్, ఓటీపీ ఎప్పుడూ ఎవరితో షేర్ చేసుకోవద్దని చెబుతోంది.

ఇంతకు ముందే ఎస్బీఐ బ్యాంకు పేరుతో నడుస్తున్న నకిలీ వెబ్‌సైట్ ( Fake Website ) విషయంలో కూడా అప్రమత్తత జారీ చేసింది. ఈ నకిలీ వెబ్‌సైట్లలో తమ అక్కౌంట్ నెంబర్, పాస్ వర్డ్ నమోదు చేయాల్సిందిగా ఉందని..ఎస్బీఐ అలా ఎప్పుడూ కోరదని స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో వినియోగదారుల భద్రతపై ఎస్బీఐ చాలా ఆందోళన చెందుతోంది. ఎందుకంటే ఇక్కడి నుంచే ఆన్‌లైన్ మోసాల ఫిర్యాదులు పెరుగుతున్నాయని గమనించింది. కొంతమంది ఎస్బీఐ పేరుతో నమ్మించి మోసం చేస్తూ మెస్సేజ్‌లు పంపుతున్నారని తెలిపింది. అందుకే రానున్న రోజుల్లో ఎస్ఎంఎస్, ట్వట్టర్‌పై కూడా అలర్ట్ మెస్సేజెస్ పంపండం ప్రారంభిస్తుంది. Also read: Stimulus Package: మరో ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించిన కేంద్రం! పూర్తి వివరాలు...

వినియోగదారులు బ్యాలెన్స్ చెక్ ( Balance check ) చేసుకునేందుకు తమ రిజిస్టర్ మొబైల్ నెంబర్ ( Registered Mobile number ) నుంచి టోల్ ఫ్రీ నెంబర్ 9223766666 కు మిస్డ్ కాల్ ఇచ్చి..తెలుసుకోవచ్చు. అదే ఎస్ఎంఎస్ ద్వారా బ్యాలెన్స్ తెలుసుకునేందుకు 9223766666 కు BAL అనే మెస్సేజ్ పంపడం ద్వారా తెలుసుకోవచ్చు. ఆ తరువాత బ్యాలెన్స్ మెస్సేజ్ వస్తుంది. ఈ సౌకర్యం పొందాలంటే మీ మొబైల్ నెంబర్ బ్యాంకులో రిజిస్టర్ కావల్సి ఉంటుంది. బ్యాంకింగ్ ఫ్రాడ్ నుంచి రక్షించుకునేందుకు కొన్ని టిప్స్ కూడా ఎస్బీఐ జారీ చేసింది. 

ఎప్పుడూ చేయకూడని 5 తప్పులు లేదా పొరపాట్లు

ఎప్పుడూ తమ ఓటీపీ, పిన్, సీవీవీ, యూపీఐ పిన్ ఎవ్వరితోనూ షేర్ చేసుకోకూడదు. ఇలాంటి మోసాలు ఫోన్ కాల్ ద్వారా జరుగుతుంటాయి. ఇందులో మీ సాధారణంగా మీ డెబిట్ కార్డు బ్లాక్ అవనుందని..దీనికోసం పాస్ వర్డ్ మార్చుకోవాలని వస్తుంటుంది. తరువాత సివివి, ఓటీపీ ఇతర వివరాల్ని కోరుతుంటుంది. 

ఫోన్ లో ఎప్పుడూ బ్యాంకింగ్ సమాచారం సేవలు పొందకూడదు. ఫోన్  ద్వారా ఆన్‌లైన్ బ్యాంకింగ్  సేవల్ని పొందేటప్పుడు సీవీవీ, అక్కౌంట్ నెంబర్, ఏటీఎం కార్డు వివరాలు ఇవ్వకూడదు. ఏటీఎం కార్డు లేదా డెబిట్ కార్డు వివరాలు ఎప్పుడూ షేర్ చేసుకోకూడదు.  పబ్లిక్ ఇంటర్నెట్ తో ఎప్పుడూ బ్యాంకింగ్ చేయకూడదు. బ్యాంకు ఎప్పుడూ ఏ సమాచారాన్ని కోరదని గుర్తుంచుకోండి. బ్యాంకు ఎప్పుడూ తమ కస్టమర్లకు సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని కోరదని ఎస్బీఐ తెలిపింది. Also read: Asaduddin Owaisi: పార్టీ చీఫ్‌ను కలిసిన బీహార్ ఎంఐఎం ఎమ్మెల్యేలు

Trending News