Maharashtra Political Crisis: మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం రాబోతోందా..సంజయ్‌ రౌత్‌ వాదన ఏంటి..!

Maharashtra Political Crisis: మహారాష్ట్రలో పొలిటికల్ కథా చిత్రమ్‌ కొనసాగుతోంది. గంట గంటకు రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. దీంతో మహారాష్ట్రలో ఏం జరగబోతోందన్న ఉత్కంఠ నెలకొంది.

Written by - Alla Swamy | Last Updated : Jun 23, 2022, 02:28 PM IST
  • మహారాష్ట్రలో పొలిటికల్ కథా చిత్రమ్‌
  • మారుతున్న సమీకరణాలు
  • సంజయ్ రౌత్ కీలక ప్రకటన
Maharashtra Political Crisis: మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం రాబోతోందా..సంజయ్‌ రౌత్‌ వాదన ఏంటి..!

Maharashtra Political Crisis: మహారాష్ట్రలో పొలిటికల్ కథా చిత్రమ్‌ కొనసాగుతోంది. గంట గంటకు రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. దీంతో మహారాష్ట్రలో ఏం జరగబోతోందన్న ఉత్కంఠ నెలకొంది. మహా వికాస్ అఘాడీ కూటమి ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చన్న ప్రచారం సాగుతోంది. ఈక్రమంలో ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ కీలక ప్రకటన చేశారు. త్వరలోనే అన్ని సర్దుకుపోతాయన్నారు. తమ ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. 

తిరుగుబాటు నేతల్లో 20 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని చెప్పారు. వాళ్లు ముంబైకి రాగానే పొలిటికల్ డ్రామాకు తెరపడుతుందన్నారు. ఈడీకి భయపడే శివసేనకు ద్రోహం చేస్తున్నారని తెలిపారు. అలాంటి వాళ్లు బాల్ ఠాక్రే అనుచరులు, అసలైన శివ సైనికులు కారన్నారు ఎంపీ సంజయ్ రౌత్. బలపరీక్ష ఎప్పుడు జరిగినా తమకు ఢోకా లేదని స్పష్టం చేశారు. పార్టీ నుంచి వెళ్లి పోయే వారు బాలా సాహెబ్ భక్తులు కాదని..ఇవాళ సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఎలాంటి సమావేశం ఏర్పాటు చేయడం లేదన్నారు.

మరోవైపు రాజకీయ అనిశ్చితిని క్యాచ్ చేసుకోవాలని బీజేపీ స్కెచ్‌లు వేస్తోంది. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు పావులు కదుపుతోంది. అస్సాంలోని గౌహతి నుంచే ఇందుకు నాంది పలుకుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏక్‌నాథ్‌ షిండే శిబిరానికి అస్సాం మంత్రి అశోక్ సింఘాల్ వెళ్లడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ ఏర్పాటుపై మంతనాలు, సంప్రదింపులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు కలిసి వస్తే..వారికి భారీగా పదవులు ఇచ్చేందుకు బీజేపీ సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

తమతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే శివసేన రెబల్స్‌ ఎమ్మెల్యేలకు 8 మందికి మంత్రి పదవులు, ఐదుగురికి సహాయక మంత్రులు ఆఫర్ చేసినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. శివసేన ఎంపీలు వచ్చినా..వారికి సైతం మంచి పదవులు ఇచ్చేందుకు బీజేపీ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. వారిని కేంద్ర కేబినెట్‌లోకి తీసుకునే ఉద్దేశం కూడా ఉందని వార్తలు వస్తున్నాయి.

Also read:Cine Workers Strike: పంతాలు, పట్టింపులు వద్దు..సినీ నిర్మాతలు, కార్మికులకు మంత్రి తలసాని పిలుపు..!

Also read:Edible Oil Prices: గుడ్ న్యూస్.. తగ్గిన వంట నూనెల ధరలు.. ఏయే బ్రాండ్స్‌పై ఎంత తగ్గిందో తెలుసా..  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News