Rajdhani Express: రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో ఎగిసిపడిన పొగలు.. ఆందోళనలో ప్రయాణికులు

Fire in Rajdhani Express: చెన్నై నుంచి దిల్లీ వెళ్తున్న రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో పొగలు చెలరేగాయి. దీంతో రైలును నెల్లూరు జిల్లా కావలి వద్ద నిలిపేశారు. ప్రయాణీకులు తీవ్ర భయాందోళన చెందారు.

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Apr 11, 2023, 05:33 PM IST
Rajdhani Express: రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో ఎగిసిపడిన పొగలు.. ఆందోళనలో ప్రయాణికులు

Smoke in Rajdhani Express:  రాజధాని ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. చెన్నై నుంచి ఢిల్లీకి వెళ్తున్న రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో ఉన్నట్లుండి ఒక్కసారిగా పొగలు వ్యాపించాయి. బి-5 బోగీ నుంచి ఈ పొగలు రావడం గమనించిన రైల్వే సిబ్బంది..  ఈ రైలును నెల్లూరు జిల్లా కావలి వద్ద సుమారు 20 నిమిషాలపాటు ఆపివేశారు.  దీంతో ప్యాసింజర్స్ ఆందోళనకు గురయ్యారు. రైల్వే సిబ్బంది, అధికారులు వేగంగా స్పందించడంతో ప్రమాదం తప్పినట్లయింది. 

బ్రేకులు ఫెయిల్‌ కావడంతోనే పొగలు వచ్చినట్లు కావలి రైల్వేస్టేషన్‌ సూపరింటెండెంట్‌ శ్రీహరిరావు వెల్లడించారు. పొగలు రావడం గమనించిన రైల్వే సిబ్బంది వెంటనే మరమ్మతులు చేపట్టారు. ఈ ఘటనలో ఎవరికీ ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.  అనంతరం రాజధాని ఎక్స్‌ప్రెస్‌ అక్కడి నుంచి బయల్దేరింది.

Also Read: Good news: ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మధ్యాహ్నం 2 గంటల వరకే పని..!

తిరుపతికి వందే భారత్
తెలుగు రాష్ట్రాల మధ్య రెండో వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు నిన్న పట్టాలెక్కింది. . సికింద్రాబాద్‌-తిరుపతి మధ్య ఈ ట్రైన్ ను నడపనున్నారు. ఈ రైలును ప్రధాని మోదీ శనివారం పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, గవర్నర్‌ తమిళిసై పాల్గొన్నారు. హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లే ప్రయాణీకులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మంగళవారం మినహా మిగిలిన రోజుల్లో ఈ రైలు సేవలందించనుంది.

Also Read: Kiren Rijiju Accident: కేంద్ర మంత్రికి తృటిలో తప్పిన ప్రమాదం.. కారును ఢీకొట్టిన ట్రక్కు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News