Heavy Rains: ఇక ఏపీ, తెలంగాణలో విస్తారంగా వర్షాలు, ఎల్లో అలర్ట్ జారీ

Heavy Rains: గత కొద్దికాలంగా స్తబ్దుగా ఉన్న నైరుతి రుతు పవనాల్లో కదలిక వచ్చింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు ప్రారంభమయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 23, 2024, 09:21 AM IST
Heavy Rains: ఇక ఏపీ, తెలంగాణలో విస్తారంగా వర్షాలు, ఎల్లో అలర్ట్ జారీ

Heavy Rains: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణం మారింది. దాదాపు అన్ని జిల్లాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడితే, మరి కొన్నిచోట్ల భారీ వర్షాలు నమోదయ్యాయి. రానున్న రెండ్రోజులు భారీ వర్షాలు పడనున్నాయని ఐఎండీ సూచించింది. 

తెలంగాణలోని నల్గొండ, వరంగల్, జనగామ, యాదాద్రి భువనగిరి, హనుమకొండ, సూర్యాపేట, నాగర్‌కర్నూలు, మహబూబ్ నగర్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో ఇవాళ మోస్తరు వర్షాలు పడనున్నాయి. దాంతోపాటు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులు ఉండవచ్చని అంచనా. మిగిలిన కొన్ని జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక హైదరాబాద్‌లో ఇవాళ వాతావరణం మేఘావృతమై ఉంటుంది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడవచ్చు.

ఇక ఏపీలోని ఉత్తర కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలతో పాటు ఉరుములు మెరుపులు పడే అవకాశముంది. ఇక దక్షిణ కోస్తాలో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. ఇవాళ, రేపు దక్షిణ కోస్తాలో ఇదే పరిస్థితి కొనసాగవచ్చు. కొన్ని ప్రాంతాల్లో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీయనున్నాయి. అటు రాయలసీమలో కూడా ఇవాళ, రేపు మోస్తరు వర్షాలు పడవచ్చు. 

ప్రస్తుతం నైరుతి రుతు పవనాలు అరేబియా సముద్రంలోనూ, గుజరాత్, మహారాష్ట్రలో, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, , జార్ఘండ్, బీహర్ రాష్ట్రాల్లో విస్తరిస్తున్నాయి. 

Also read: NEET 2024 Issue: నీట్ వివాదం ప్రభావం, వాయిదా పడిన NEET PG 2024

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News