Supreme Court: అర్ధరాత్రిళ్లు అరెస్ట్ చేయడంపై పిటిషన్.. ఈడీ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్టు..

Plea Against Arrest during Oddhours: ఇటీవల తనను అరెస్టు చేసి రాత్రంతా ప్రశ్నల వర్షం కురిపించారని 64 ఏళ్ల వ్యాపారవేత్త రామ్ ఇస్రానీ సుప్రీకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సుప్రీమ్ కోర్టు కేంద్ర ఏజీన్సీ సంస్థలు అరెస్టు చేయడంపై స్పందించింది.  

Written by - Inamdar Paresh | Last Updated : May 13, 2024, 04:12 PM IST
  • నా నిద్రకు భంగం కల్గించారు..
  • ఈడీ స్పందనను కోరిన అత్యున్నత ధర్మాసనం..
Supreme Court: అర్ధరాత్రిళ్లు అరెస్ట్ చేయడంపై పిటిషన్.. ఈడీ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్టు..

Supreme Court seeks Enforcement directorate response to 64 year old ram issrani plea: సాధారణంగా సీబీఐ,ఈడీ, ఐబీ అధికారులు ఎక్కడైన మోసాలు, అక్రమాలకు పాల్పడినట్లు ఎవరిపైన అయిన ఫిర్యాదులు అందితే ఏ సమయంలోనైన దాడులు చేస్తుంటారు. తమ సిబ్బందితో కలిసి ఏక కాలంలో ఫ్రాడ్ కు పాల్పడిన వారి ఇల్లు, వారికి సంబంధం ఉన్న ప్రతిఒక్కరి ఇళ్లలో సోదాలు నిర్వహిస్తుంటారు. దాడులు చేసి, అక్కడ దొరికిన సొత్తుగురించి ఆరాతీస్తారు. సరైన లెక్కలు చూపించలేకపోయినట్లైతే వెంటనే వాటిని సీజ్ చేసి, నిందితుల నుంచి వాంగ్మూలం సేకరించి అరెస్టులు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో.. ఇటీవల తనను అర్దరాత్రి అరెస్ట్ చేసిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ రాత్రంత తనను మేల్కొని ఉండేలాచేసి తన నిద్రకు భంగం కల్పించిందని అన్నారు.

Read more: MP Elections 2024: ఎన్నికల వేళ కాంగ్రెస్ బంపర్ ఆఫర్.. ఇద్దరు భార్యలున్న వారికి కూడా ఆ పథకం.. వీడియో వైరల్..

రాజ్యాంగం తనకు కల్పించిన ప్రాథమిక హక్కుకు ఈడీ విఘాతం కల్పించిందని, 64 ఏళ్ల వ్యాపారవేత్త రామ్ ఇస్రానీ బాంబే హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. అంతేకాకుండా తనకు బెయిల్ కూడా ఇవ్వాలని కూడా మరో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన బాంబే హైకోర్టు.. కేంద్ర ఏజెన్సీ సాక్షులు, నిందితుల వాంగ్మూలాలను అసాధారణ సమయాల్లో నమోదు చేయడానికి మినహాయింపు ఉన్నట్లు తెలిపింది. అంతేకాకుండా.. బెయిల్ ఇవ్వడానికి కూడా నిరాకరించింది.దీంతో ఆయన తాజాగా, సుప్రీమ్ కోర్టులో మరో పిటిషన్ వేశారు.

బ్యాంక్ మోసం కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ..  తనను అక్రమంగా అరెస్టు చేసిందని ఆరోపిస్తూ 64 ఏళ్ల వ్యాపారవేత్త రామ్ ఇస్రానీ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీమ్ కోర్టు విచారించింది. గత ఏడాది ఆగస్టు 7, 8 తేదీల్లో తనను ఈడీ కార్యాలయంలో వేచి ఉండేలా చేశారని, ఆ తర్వాత రాత్రి 10:30 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు తన స్టేట్‌మెంట్‌ను నమోదు చేశారని ఆయన పేర్కొన్నారు. తనను మొత్తం 20 గంటల పాటు మెలకువగా ఉంచారని, ఆగస్టు 8వ తేదీ ఉదయం 5:30 గంటలకు అరెస్టు చేసినట్లు చూపించారని ఆయన సమర్పించారు.

Read more: Members of Parliament: ఎంపీగా గెలిచిన వారికి వచ్చే జీతం, పొందే సౌకర్యాలు ఏంటో తెలుసా..?

దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తులు హృషికేష్ రాయ్, ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం కూడా బెయిల్ కోసం వెకేషన్ బెంచ్‌కు తరలించే స్వేచ్ఛను పిటిషనర్‌కు ఇచ్చింది. అంతే కాకుండా.. విచారణ కోసం సమన్లు జారీ చేసినప్పుడు స్టేట్‌మెంట్‌లను రికార్డ్ చేసే సమయాలకు సంబంధించి సర్క్యులర్ లేదా ఆదేశాలు జారీ చేయాలని EDని ఆదేశించింది.

అయితే.. పిటిషనర్‌ను తరపు లాయర్ లు వాదిస్తూ.. తమ క్లయింట్ అరెస్టు చేసిన వెంటనే మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచలేదని సుప్రీంకోర్టుకు తెలియజేశారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. మూడు వారాల్లో తమ స్పందన ఏంటో తెలియజేయాలని ఈడీని ఆదేశించింది. ఇదిలా ఉండగా.. 64 ఏళ్ల వ్యాపారవేత్త తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్, విజయ్ అగర్వాల్, మహేష్ అగర్వాల్, అంకుర్ సైగల్, కాజల్ దలాల్, ఇసి అగ్రవాలాలు సుప్రీంకోర్టుకు హాజరయ్యారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News