PM Vs CM Revanth: పీఎం Vs సీఎం మాటల యుద్ధం..

PM Vs CM Revanth: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. అంతేకాదు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా నరేంద్ర మోడీ కాంగ్రెస్ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలపై చేసిన వ్యాఖ్యలపై తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు.  

Written by - TA Kiran Kumar | Last Updated : Nov 10, 2024, 10:21 AM IST
PM Vs CM Revanth: పీఎం Vs సీఎం మాటల యుద్ధం..

PM Vs CM Revanth: సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు ముచ్చటగా మూడోసారి కేంద్రంలో కొలువు తీరింది. తొలిసారి బీజేపీకి సొంతంగా కాకుండా.. మిత్ర పక్షాలపై ఆధారపడేలా ప్రభుత్వం ఏర్పడింది. ఆ తర్వాత వచ్చిన జమ్మూ కశ్మీర్ తో పాటు హర్యానా ఎన్నికల్లో  భారతీయ జనతా పార్టీ సత్తా చాటింది. హర్యానాలో వరుసగా హాట్రిక్ విజయాన్ని అందుకొంది. జమ్మూ కశ్మీర్ లో ఎక్కువ ఓట్లు రాబట్టిన పార్టీగా నిలిచింది. సీట్ల పరంగా రెండో స్థానంలో నిలిచింది. అంతేకాదు ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దూకుడు మీదుంది. అదే ఊపుతూ మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల్లో బరిలో దిగుతుంది.

ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డి ఆ రాష్ట్రంలో ప్రచారం నిర్వహిస్తూ.. నరేంద్ర మోడీపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామిలతో అధికారంలోకి వచ్చిందన్నారు. అంతేకాదు ఇప్పటికే ఇచ్చిన హామిలను నెరవేర్చలేక చతికిల బడిన విషయాన్ని ప్రస్తావించారు. తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు తప్పించి మిగతా ఏ హామిలు నెరవేరలేదన్నారు. అంతేకాదు మహిళలకు రూ. 2500 లతో పాటు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఎన్నో కొర్రీలతో కొంత మందికే పరిమితం చేసిందనే విషయాన్ని ప్రస్తావించారు. అంతేకాదు రైతు రుణ మాఫీ కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదన్నారు.
 
దీనికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. కాంగ్రెస్‌ అంటే గ్యారెంటీ, గ్యారెంటీ అంటే కాంగ్రెస్‌ అన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్‌ రెడ్డి.  కాంగ్రెస్‌ అధికారంలో వున్న రాష్ట్రాల్లో పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. పేదలకు లక్షల ఇళ్ళు కట్టించి ఇచ్చిన కాంగ్రెస్‌ నేతకు సొంత ఇల్లు కూడా లేదంటూ కాంగ్రెస్ పార్టీ అనధికార అధ్యక్షుడిగా వ్యవహరిస్తూన్న రాహుల్ గాంధీని ప్రస్తావించారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఎం రేవంత్‌ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే రాహుల్ గాంధీ ఇంటి ప్రస్తావనను బీజేపీ నేతలు ఎద్దేవా చేశారన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసు సహా పలు కేసుల్లో రాహుల్ అక్రమంగా ఆస్తులు సమకూర్చుకున్నారన్న అంశంపై ప్రస్తుతం బెయిల్ పై తిరుగుతున్న విషయాన్ని ప్రస్తావించారు.

ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..

ఇదీ చదవండి : Balayya Heroine: ఎఫైర్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన బాలయ్య భామ.. మైండ్ బ్లాంక్ చేస్తోన్న హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News