బంగారంపై దిగుమతి సుంకాన్ని పెంచుతూ ఆర్ధిక మంత్రి నిర్మల సభలో బాంబు పేల్చిన విషయం తెలిసింది. తాజా నిర్ణయంతో ప్రస్తుతం 10 శాతంగా ఉన్న దిగుమతి సుంకాన్ని 12.5 శాతానికి పెరిగింది. దీంతో బంగారు ధరలు అమాంతంగా పెరిపోయాయి. తాజా అంశం జనాల్లో తీవ్ర చర్చకు తెరదీసింది.
బంగారం పై దిగుమతి సుంకం పెంపుపై రెవెన్యూ కార్యదర్శి అజయ్ భూషణ్ స్పందించారు. ఓ ప్రముఖ మీడియాతో ఆయన మాట్లాడుతూ అత్యవసరం కాని వస్తువుల దిగుమతి తగ్గించే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. మన విదేశీ కరెన్సీని అవసరం లేని వస్తువులను దిగుమతి చేసుకోవడం ద్వారా ఖర్చు చేయడం సరైన చర్య కాదని అభిప్రాయపడ్డారు ఆర్ధిక క్రమ శిక్షణలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని దీన్ని జనాలు అర్థం చేసుకుంటారని భావిస్తున్నట్లు తెలిపారు