Tigress Sheela: మూడు పిల్లలకు జన్మనిచ్చిన షీలా

దేశంలో పులుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా ప‌శ్చిమ‌బెంగాల్ రాష్ట్రం సిలిగురి జిల్లాలోని బెంగాల్ స‌ఫారీ (Bengal Safari) లో ఓ ఆడ పులి మూడు పిల్లలకు జన్మనిచ్చింది.

Updated: Aug 12, 2020, 04:56 PM IST
Tigress Sheela: మూడు పిల్లలకు జన్మనిచ్చిన షీలా
ANI

Bengal Safari: న్యూఢిల్లీ: దేశంలో పులుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా ప‌శ్చిమ‌బెంగాల్ రాష్ట్రం సిలిగురి జిల్లాలోని బెంగాల్ స‌ఫారీ ( Bengal Safari ) లో ఓ ఆడ పులి మూడు పిల్లలకు జన్మనిచ్చింది. బెంగాల్ స‌ఫారీలో ఉన్న షీల అనే పులి (Tiger Sheela) ఒకే కాన్పులో మూడు పిల్ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చిందని సఫారీ డైరెక్టర్ ధర్మదేవ్ రాయ్ తెలిపారు. Also read: Bengaluru: ఆలయాన్ని కాపాడేందుకు ముస్లింల మానవహారం

ప్రస్తుతం ఆ స‌ఫారీలో మొత్తం పులుల సంఖ్య ఇప్పుడు ఏడుకు చేరిందని బుధవారం వెల్లడించారు. బెంగాల్ స‌ఫారీలో స‌ఫారీలో ఇప్ప‌టి వ‌ర‌కు కేవ‌లం నాలుగు పులులు మాత్ర‌మే ఉండేవ‌ని ధర్మదేవ్ రాయ్ వివరించారు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో షీల పిల్లలకు పాలు ఇస్తున్న వీడియో, ఫొటోలు వైరల్ అవుతున్నాయి.