శుభవార్త.. మళ్లీ దిగొచ్చిన బంగారం ధరలు

 బులియన్ మార్కెట్‌లో ఈవారం బంగారం, వెండి ధరలు నేలచూపులు చూస్తున్నాయి. బంగారం ధరలు వరుసగా మూడో రోజు దిగిరాగా, వెండి సైతం బంగారం బాటలోనే పయనించింది.

Written by - Shankar Dukanam | Last Updated : Jun 7, 2020, 07:43 AM IST
శుభవార్త.. మళ్లీ దిగొచ్చిన బంగారం ధరలు

బులియన్ మార్కెట్‌లో వరుసగా మూడోరోజూ బంగారం ధరలు తగ్గాయి. మొన్న మార్కెట్లో ఆల్‌టైమ్ రికార్డు ధరలు నమోదు చేసిన బంగారం ధరలు దిగి రావడం కొనుగోలుదారులకు శుభవార్త.  మరోవైపు వెండి ధర సైతం బంగారం దారిలోనే నడిచింది. ఆసుపత్రి నుండి పారిపోయిన కరోనా పేషంట్..

హైదరాబాద్‌, విశాఖ, విజయవాడ మార్కెట్లలో నేడు బంగారం ధర రూ.140 మేర ఓ మోస్తరుగా తగ్గింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.48,640కి దిగొచ్చింది.  అదే విధంగా 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.44,560కి క్షీణించింది. మీరా చోప్రా హాట్ ఫొటోలు వైరల్

ఢిల్లీ మార్కెట్‌లో వరుసగా మూడోరోజు బంగారం ధరలు తగ్గాయి. నిన్న రూ.500 మేర ధర తగ్గిన బంగార ధర నేటి మార్కెట్‌లో రూ150 మేర తగ్గింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.46,500కి పతనమైంది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.45,300కి పడిపోయింది.  లాక్‌డౌన్‌లో అందాల ‘నిధి’‌ని చూశారా!

ఓ వైపు బంగారం ధరలు దిగిరాగా, మరోవైపు వెండి సైతం బంగారాన్ని అనుసరించింది. నిన్న మార్కెట్‌లో రూ.1,260 మేర భారీగా తగ్గిన వెండి ధర నేడు రూ.400 మేర తగ్గింది. దీంతో నేడు 1 కేజీ వెండి ధర ధర రూ.48,500కి దిగొచ్చింది. దేశ వ్యాప్తంగా వెండి ఇదే ధర వద్ద కొనసాగుతోంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 
గ్లామర్ డాల్ సెక్సీ ఫొటోలు వైరల్
 

Trending News