కేంద్రానికి షాక్: త్రిపుల్ తలాక్ ఆర్డినెన్స్‌ని సవాల్ చేస్తూ సుప్రీంలో పిటిషన్

త్రిపుల్ తలాక్ ఆర్డినెన్స్‌ని సవాల్ చేస్తూ సుప్రీంలో పిటిషన్

Last Updated : Sep 25, 2018, 05:08 PM IST
కేంద్రానికి షాక్: త్రిపుల్ తలాక్ ఆర్డినెన్స్‌ని సవాల్ చేస్తూ సుప్రీంలో పిటిషన్

వివాదాస్పదమైన త్రిపుల్ తలాక్ బిల్లుకి వ్యతిరేకంగా కేంద్రం ఇటీవలే ప్రతిష్టాత్మకంగా భావిస్తూ తీసుకొచ్చిన త్రిపుల్ తలాక్ ఆర్డినెన్స్‌ని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. సున్ని ముస్లిం స్కాలర్స్ అండ్ క్లరిక్స్‌కి చెందిన సమస్త కేరళ ఎయ్యత్ ఉల్ ఉలమ అనే ముస్లిం సంస్థ సుప్రీం కోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేసింది. త్రిపుల్ తలాక్ చెప్పడాన్ని ఇకపై నేరంగా పరిగణించాల్సిందిగా జారీ అయిన ఆర్డినెన్స్‌ని ఇటీవలే కేంద్ర కెబినెట్ ఆమోదించిన సంగతి తెలిసిందే. అయితే, కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఈ ఆర్డినెన్స్‌పై రాజకీయవర్గాల్లో భిన్నాభిప్రాయాలు వినిపించాయి. 

ఇదే త్రిపుల్ తలాక్ ఆర్డినెన్స్‌ ఆమోదించిన రోజే ఈ అంశంపై ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందిస్తూ.. ''ముస్లిం మహిళలకు ఏ మాత్రం న్యాయం చేసేదిగా లేని ఈ ఆర్డినెన్స్‌ని సవాల్ చేస్తూ ఏదైనా ముస్లిం మైనార్టీ సంస్థ సుప్రీం కోర్టులో సవాల్ చేయాల్సిన అవసరం ఉంది" అని అభిప్రాయపడ్డారు. 

Trending News