UP Bus Stuck In Water: ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ సరిహద్దులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నదులు పొంగిపొర్లుతున్నాయి. ఈ క్రమంలో ఓ బస్సు నదిలో చిక్కుకుపోగా.. అందులోని 40 మంది ప్రయాణికులను జేసీబీ సహాయంతో రక్షించారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఘటన బిజ్నోర్ జిల్లాలో మండవాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్వాలి నదిపై చోటు చేసుకుంది. నదిలో చిక్కుకుపోయిన బస్సులోని 40 మంది ప్రయాణికులను సురక్షితంగా రక్షించినట్లు పోలీసులు వెల్లడించారు.
భారీ వర్షాల కారణంగా కొత్వాలి నది నీట మట్టం భారీగా పెరిగింది. దీంతో నజీబాబాద్-హరిద్వార్ రోడ్డుపై వరద నీరు ఉప్పొంగింది. ఈ క్రమంలో నజీబాబాద్ నుంచి హరిద్వార్‌కు 40 మంది ప్రయాణికులతో కొత్వాల్ నది దాటేందుకు ప్రయత్నించింది. బస్సు కాస్తు ముందుకు వెళ్లగానే కదల్లేని పరిస్థితి నెలకొంది. దీంతో వరద నీరు మధ్యలో చిక్కుకుపోవడంతో బస్సులోని ప్రయాణికులు ప్రాణ భయంతో గట్టిగా కేకలు వేశారు.
Bus with 25 passengers stuck in water flow in Mandawali region of UP's Bijnor due to sudden rise in water levels in Kotawali seasonal river on Hardiwar-Bijnor road. Efforts on to prevent overturning of the vehicle using a crane.pic.twitter.com/FVDZKf868B
— Waquar Hasan (@WaqarHasan1231) July 22, 2023
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. ముందుగా బస్సు కదలకుండా ఓ భారీ తీగను కట్టి.. ఆ తీగను బ్రిడ్జికి బిగించారు. జేసీబీ సాయంతో ప్రయాణికులను ఒక్కొక్కరిని సురక్షితంగా ప్రాణాలతో కాపాడారు. నజీబాబాద్ పోలీస్ సర్కిల్ ఆఫీసర్ గజేంద్ర సింగ్ మాట్లాడుతూ.. బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారని.. హరిద్వార్‌కు వెళ్తుండగా నది ప్రవాహంలో చిక్కుకుందని తెలిపారు. చాలా కష్టపడి జేసీబీ సాయంతో ప్రయాణికులను సురక్షితంగా బయటకు రప్పించామని చెప్పారు. బస్సును కూడా ప్రవాహం నుంచి బయటకు తీశామన్నారు.
#WATCH | UP: A Bus got stuck in Bijnor due to a heavy flow of water from the Kotwali River. A rescue operation is underway. pic.twitter.com/CkjPCQIrva
— ANI UP/Uttarakhand (@ANINewsUP) July 22, 2023
ఉత్తరప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యూపీలో గత 24 గంటల్లో వర్షాల కారణంగా 9 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో పాము కాటు కారణంగానే ఐదుగురు మరణించినట్లు అధికారులు తెలిపారు. నీటమునిగి మిగిలిన వారు మృతి చెందారని చెప్పారు. బదౌన్, ఫరూఖాబాద్, మధురలోని యమునాలో గంగ ప్రమాద స్థాయికి మించి ప్రవహిస్తోందని ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్ అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని కరకట్టలు సురక్షితంగా ఉన్నాయని రిలీఫ్ కమిషనర్ నవీన్ కుమార్ పేర్కొన్నారు.
Also Read: Special Train: గుడ్‌న్యూస్ చెప్పిన రైల్వే శాఖ.. వారి కోసం స్పెషల్ ట్రైన్స్
Also Read: Snake in Ecil Canteen: క్యాంటీన్ పప్పులో పాము పిల్ల.. భయాందోళనలో ఈవీఎం ఉద్యోగులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook