Corona vaccine: దేశమంతా వచ్చే నెల కరోనా వ్యాక్సిన్ కోసం సిద్ధమవుతోంది. మరి ముస్లింలు వ్యాక్సిన్ తీసుకుంటారా లేదా అనే విషయం చర్చనీయాంశమైందిప్పుడు. దీనికి కారణం వ్యాక్సిన్ హలాల్నా లేదా హరామ్నా అనే విషయం తేలాల్సి ఉండటమే..
వ్యాక్సిన్ హరామ్నా కాదా అనే చర్చ రావడానికి కారణం వ్యాక్సిన్ తయారీలో పంది కొవ్వు వినియోగించారనే వార్తలు రావడమే. ఈ వ్యాక్సిన్‌ను ముందుగా తమ వైద్యులు, ముఫ్తీ తనిఖీ చేసిన తరువాతే తుది నిర్ణయం తీసుకుంటారని ముంబై రజా అకాడమీకు చెందిన మౌలానా ముఫ్తీ తెలిపారు. తనిఖీ అనంతరం అనుమతి ఇచ్చిన తరువాతే వ్యాక్సిన్‌ను ముస్లింలు తీసుకుంటారని..లేనిపక్షంలో తిరస్కరిస్తామని చెప్పారు.
అసలు వ్యాక్సిన్ హలాల్ పద్ధతిలో తయారైందా లేదా హరామ్ పద్ధతిలో తయారైందా అనే విషయంలో ప్రపంచవ్యాప్తంగా మౌలానా ముఫ్తీల్లో చర్చ ప్రారంభమైంది. ఒకవేళ ప్రచారంలో ఉన్నట్టుగా పంది కొవ్వు వినియోగించి ఉంటే..కరోనా వ్యాక్సిన్ తీసుకోవడం సమంజసమా కాదా అనేది మరో చర్చ. అయితే ప్రాణం కాపాడుకునే క్రమంలో అల్లాహ్..హరామ్ వస్తువుల్ని వినియోగించుకునేందుకు అనుమతిచ్చారని ఇస్లామిక్ స్కాలర్ అతీఖుర్ రెహ్మాన్ తెలిపారు. సమాజాన్ని చైతన్యపర్చడమేత ముస్లిం మతపెద్దల పని అని..అందుకే ఈ విషయంలో ఏ విధమైన ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు.
Also read: CoviShield: ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌కు వచ్చే వారం అనుమతులు!
మరోవైపు లక్నోకు చెందిన మౌలానా ఖాలిద్ ఫిరంగీ మహ్లీ అయితే..ఇటువంటి వార్తల్ని పట్టించుకోకుండా నిరభ్యంతరంగా వ్యాక్సిన్ తీసుకోమని సలహా ఇస్తున్నారు. ప్రాణాన్ని కాపాడుకోవడం అన్నింటికంటే పెద్ద విషయమని..అందుకే సాధారణ పద్ధతుల్లోనే వ్యాక్సిన్ తీసుకోమని ..పార్టీ లేదా లీడర్ దృష్టితో చూడవద్దంటున్నారు.
వ్యాక్సిన్ మంచిదే అని ధృవీకరించిన యూఏఈ ఫత్వా కౌన్సిల్
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన ముఖ్య ఇస్లామిక్ సంస్థ యూఏఈ ఫత్వా కౌన్సిల్..ఈ వ్యాక్సిన్ మంచిదే అని ధృవీకరించింది. ఒకవేళ పంది కొవ్వు వినియోగించినా సరే వ్యాక్సిన్ వాడటం సరైందేనని చెప్పింది. వేరే ప్రత్యామ్నాయం లేనప్పుడు వ్యాక్సిన్ తీసుకోవడంలో తప్పు లేదని కౌన్సిల్ ఛీఫ్ షేక్ అబ్దుల్లా బిన్ బయ్యా స్పష్టం చేశారు.
వ్యాక్సిన్ తయారీలో పోర్క్ అంటే పంది కొవ్వు వినియోగించినా సరే..మెడిసిన్ రూపంలో తీసుకోవడంలో తప్పు లేదనేది కొందరి అభిప్రాయం. వ్యాక్సిన్లలో సాధారణంగా పోర్క్ జిలెటిన్ వినియోగిస్తారని..అందుకే ఈ విషయంలో ముస్లింలలో ఆందోళన ఎక్కువైందని..ఎందుకంటే ఇస్లామిక్ చట్టం ప్రకారం పోర్క్ కలిసిన పదార్ధాలు తినడమనేది హరామ్‌గా భావిస్తారు.
Also read: India Covid-19: కరోనాతో గత 24గంటల్లో 312 మంది మృతి
ఏదైనా జంతువు నుంచి యాంటీబాడీలు సేకరించి వ్యాక్సిన్ తయారు చేస్తే దానిని వెక్టార్ వ్యాక్సిన్‌గా పిలుస్తారని..అయితే కరోనా వ్యాక్సిన్ విషయంలో ఆ అవకాశం లేదని మెడికల్ సైన్స్ నిపుణులు చెబుతున్నారు. స్వదేశీ వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తున్న భారత్ బయోటెక్‌కు చెందిన శాస్త్రవేత్త డాక్టర్ చంద్రశేఖర్ కూడా పందికొవ్వుతో వ్యాక్సిన్‌కు సంబంధం లేదని స్పష్టం చేశారు. కరోనా వ్యాక్సిన్ విషయంలో ఇప్పుడు ప్రపంచమంతా ఇదే వార్త వైరల్ అవుతోంది. వ్యాక్సిన్ తయారీలో పంది కొవ్వు కలిసిందనే ప్రచారం సాగుతోంది. వాస్తవానికి ఇప్పటివరకూ ఏ విధమైన వైద్యపరమైన ధృవీకరణ ఈ విషయమై లేకపోయినా వదంతులు విస్తరిస్తున్నాయి. ముస్లిం వర్గాల్లో ఈ విషయమై చర్చ సాగుతోంది.
దేశంలో వ్యాక్సినేషన్ ప్రారంభం కావడానికి కొద్ది సమయమే మిగిలుంది. ఈ తరుణంలో ముస్లిం సమాజంలో ప్రారంభమైన పుకార్లు దేశంలోని వ్యాక్సినేషన్ కార్యక్రమంపై ప్రభావం చూపిస్తుందనే అభిప్రాయం కలుగుతోంది. ఒకవేళ ఈ పుకార్లకు బలం చేకూరితే..పెద్ద సంఖ్యలో ప్రజలు కరోనా వ్యాక్సిన్ తీసుకునేందుకు నిరాకరించే అవకాశాలున్నాయి.