Kranti Redkar letter to Maha CM: మహారాష్ట్ర సీఎంకు వాంఖడే భార్య లేఖ

Sameer Wankhede's wife Kranti Redkar in letter to Maha CM: సమీర్ వాంఖడేపై ఎన్‌సీబీ విచారణ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఆయన భార్య క్రాంతి రేడ్కర్ మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరేకు లేఖ రాశారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 28, 2021, 04:00 PM IST
  • ఎన్‌సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడేపై ఎన్‌సీబీ విచారణ
  • మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరేకు లేఖ రాసిన వాంఖడే భార్య క్రాంతి రేడ్కర్
  • మరాఠీ వ్యక్తిగా న్యాయం కోసం మీవైపు చూస్తున్నానని ఆవేదన
Kranti Redkar letter to Maha CM: మహారాష్ట్ర సీఎంకు వాంఖడే భార్య లేఖ

Woman's dignity toyed in Chhatrapati Shivaji Maharaj state, writes Sameer Wankhede's wife to Maharashtra CM Uddhav Thackeray: ముంబై డ్రగ్స్‌ కేసులో (Mumbai Drugs Case) ఆర్యన్ ఖాన్‌ (Aryan Khan) అరెస్టులో కీలకంగా వ్యవహరించిన ఎన్‌సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే ఇప్పుడు వార్తల్లో నిలిచారు. ఆయనపై పలు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో సమీర్ వాంఖడేపై (Sameer Wankhede) ఎన్‌సీబీ విచారణ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఆయన భార్య క్రాంతి రేడ్కర్ మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరేకు లేఖ రాశారు. 

తమకు ప్రజల ముందు నిత్యం అవమానాలు ఎదురవుతున్నాయని క్రాంతి రేడ్కర్ (Kranti Redkar) ఆ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. ఛత్రపతి శివాజీ రాష్ట్రంలో ఓ మహిళను అగౌరవపరుస్తున్నారని బాధను వెలుబుచ్చారు. బాలాసాహేబ్ ఉండి ఉంటే.. ఈ వైఖరి ఆయనకు నచ్చేది కాదని పేర్కొంది. ఆయన లేరు కానీ.. మీరు ఉన్నారు.. ఆయనలో మిమ్మల్ని చూసుకుంటున్నామని సీఎం ఉద్ధవ్ థాకరేను (CM Uddhav Thackeray) ఉద్దేశించి పేర్కొంది.

Also Read : Dinosaur in UN: ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో డైనోసర్‌ స్పీచ్‌

తనకు, తన కుటుంబానికి అన్యాయం జరగడాన్ని ఉద్ధవ్ థాకరే (Uddhav Thackeray)ఒప్పుకోరని తాను నమ్ముతున్నానని లేఖలో పేర్కొంది క్రాంతి రేడ్కర్. ఒక మరాఠీ వ్యక్తిగా న్యాయం కోసం మీవైపు చూస్తున్నానని ఆవేదన చెందింది. తమకు న్యాయం జరిగేలా చూడాలంటూ కోరుతున్నానని క్రాంతి ఆ లేఖలో కోరారు.మరోపక్క వాంఖడే సోదరి జాతీయ మహిళా కమిషన్‌కు లేఖ రాశారు. తనకు ఆన్‌లైన్‌లో వేధింపులు ఎదురవుతున్నాయని అందులో వెల్లడించారు. 

Also Read : Hardship of Life: ప్రపంచం కంట కన్నీరు పెట్టిస్తున్న ఫోటో.. గుండె బరువెక్కించే...

ముంబైలో క్రూజ్ డ్రగ్స్‌ కేసులో (mumbai cruise drug case) షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌తో పాటు పలువురి అరెస్టులు సమీర్ వాంఖడే (Sameer Wankhede) నేతృత్వంలో జరిగాయి. అప్పటి నుంచి సమీర్ వాంఖడేపై పలు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ఎన్‌సీబీ (NCB) విచారణ ప్రారంభించింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News