Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాంలో వైసీపీ ఎంపీ.. ఏపీలో కలకలం

Liquor Scam: కొత్త మద్యం పాలసీ ఎక్సైజ్ టెండర్లలో అక్రమాలు జరిగాయని బీజేపీ ఆరోపిస్తోంది. బ్లాక్ లిస్టులో పెట్టిన కంపెనీలకు కట్టబెట్టారని.. అసలు బ్లాక్ లిస్టులో ఉన్న కంపెనీలను టెండర్ ప్రక్రియలో ఎలా అనుమతించారని నిలదీస్తోంది. ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డికి చెందిన సంస్థ ఉందనే ఆరోపణలు వస్తున్నాయి.

Written by - Srisailam | Last Updated : Aug 3, 2022, 04:25 PM IST
  • ఢిల్లీలో మద్యం స్కాం ప్రకంపనలు
  • బీజేపీ ఆరోపణలతో పాలసీ రద్దు
  • వైసీపీ ఎంపీ కంపెనీపై ఆరోపణలు
Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాంలో వైసీపీ ఎంపీ.. ఏపీలో కలకలం

Liquor Scam: ఆంధ్రప్రదేశ్ లో మద్యం పాలసీపై రాజకీయ రచ్చ సాగింది. ఏపీలో అందుబాటులో ఉన్న మద్యం బ్రాండ్లు వివాదాస్పదమయ్యాయి. ప్రజలు కోరుతున్న బ్రాండ్లు కాకుండా లోకల్ బ్రాండ్లను అందుబాటులో ఉంచారనే విమర్శలు వచ్చాయి. వైసీపీ నేతలకు చెందిన నేతలకు సంబంధించిన కంపెనీల్లో తయారైన నాసిరకం బ్రాండ్లను విక్రయిస్తూ.. జనాల జీవితాలతో ఆటలాడుతోందని విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఏపీలో మద్యం పాలసీ సెగలు రాజేయగా.. తాజాగా ఢిల్లీలో ప్రకంపనలు రేపుతున్న మద్యం స్కాంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ చిక్కుకోవడం సంచలనంగా మారింది. ఏపీలో రాజకీయ మంటలు రేపుతోంది.

2022 నవంబర్ నుంచి ఢిల్లీలో కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చారు. లిక్కర్ అమ్మకాల బాధ్యత నుంచి రాష్ట్ర ప్రభుత్వం తప్పుకుంది. మద్యం మాఫియాకు చెక్ పెట్టడంతో పాటు ప్రభుత్వానికి ఆదాయం పెంచడానికే కొత్త పాలసీ తీసుకొచ్చామని కేజ్రీవాల్ సర్కార్ ప్రకటించింది. ప్రభుత్వం తప్పుకోవడంతో ప్రైవేటు మద్యం వ్యాపారులు కస్టమర్లకు ఆఫర్లు పెట్టారు. వన్ ప్లస్ వన్ ఆఫర్ కూడా పెట్టారు. కొందరు వ్యాపారులు ఎంఆర్పీ రేట్ల కంటే తక్కువకే విక్రయించారు.దీంతో ఢిల్లీలో లిక్కర్ సేల్స్ భారీగా పెరిగాయి. ఆప్ సర్కార్ కు అంచనాకంటే ఎక్కువ రాబడి వస్తోంది.

అయితే కొత్త మద్యం పాలసీ ఎక్సైజ్ టెండర్లలో అక్రమాలు జరిగాయని బీజేపీ ఆరోపిస్తోంది. బ్లాక్ లిస్టులో పెట్టిన కంపెనీలకు కట్టబెట్టారని.. అసలు బ్లాక్ లిస్టులో ఉన్న కంపెనీలను టెండర్ ప్రక్రియలో ఎలా అనుమతించారని నిలదీస్తోంది. బీజేపీ ఆరోపిస్తున్న వివాదాస్పద మద్యం కంపెనీలో ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డికి చెందిన సంస్థ ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. నిషేదిత జాబితాలో ఉన్న  ఖావో గాలి అనే సంస్థ వైసీపీ ఎంపీ మాగుంటకు చెందిన కంపెనీతో కలసి సిండికేటుగా ఏర్పడిందని ఢిల్లీ బీజేపీ నేతలు చెబుతున్నారు. కేజ్రీవాల్ సర్కార్ తీసుకున్న నిర్ణయంతో కొన్ని లిక్కర్ సంస్థలకు లాభం కల్గిందని కమలనాధులు ఆరోపిస్తున్నారు. బ్లాక్ లిస్టులో ఒక్క కంపెనీ టెండర్లలో పాల్గొనడమే తప్పు అయితే.. ఆ సంస్థ మరో కంపెనీతో సిండికేట్ కావడం ఏంటని బీజేపీ నేతలు నిలదీస్తున్నారు.

ఈ వ్యవహారంలో పెద్గ మొత్తంలో డబ్బులు చేతులు మారాయని, ప్రభుత్వ పెద్దలకు వాటాలు వచ్చాయని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.  ఈ అక్రమ దందాలో 144 కోట్ల రూపాయలు కేజ్రీవాల్ ప్రభుత్వంలోని పెద్దలకు అందాయంటూ తీవ్ర ఆరోపణలు చేస్తోంది బీజేపీ. అంతేకాదు మద్యం లైసెన్సు కోసం  డిపాజిట్ చేసిన 30 కోట్ల రూపాయలను కేబినెట్ ఆమోదం లేకుండా బిడ్డర్ కు తిరిగి ఇవ్వడం పలు అనుమానాలకు తావిస్తోంది. మద్యం పాలసీ టెండర్లపై బీజేపీ చేస్తున్న ఆరోపణలతో కేజ్రీవాల్ సర్కార్ దిద్దుబాటు చర్యలకు దిగింది.  మద్యం విధానాన్ని  రద్దు చేసింది. ఆగస్టు 1 నుంచి పాత పద్దతిలోనే ప్రభుత్వం ఆధ్వర్యంలోనే మద్యం అమ్మకాలు ఉంటాయని ప్రకటించింది.మద్యం పాలసీ స్కాంపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరపాలని ఆదేశాలు ఇచ్చారు. మద్యం పాలసీ, టెండర్లపై నివేదికను తనకు సమర్పించాలని ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సక్సేనా ఆదేశించారు.

మరోవైపు ఢిల్లీ బీజేపీ నేతలు  తమ సంస్థపై చేస్తున్న ఆరోపణలను వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ఖండించారు.  పారదర్శకంగానే తమ కంపెనీ టెండర్ వేసిందని.. ఎలాంటి అక్రమాలు జరగలేదని చెప్పారు. తన మద్యం కంపెనీపై ఆరోపణలు చేసిన బీజేపీ నేత మీనాక్షి లేఖికి ఇందుకు సంబంధించి  వివరణ కూడా ఇచ్చానని మాగుంట శ్రీనివాసులు రెడ్డి తెలిపారు.

Also read:Monkeypox: దేశంలో మంకీపాక్స్‌ టెర్రర్..కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు ఇవే..!

Also read:Hyderabad Police Towers: రేపే అందుబాటులోకి పోలీస్ టవర్స్.. కంట్రోల్‌ సెంటర్‌ ప్రత్యేకతలు..! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Trending News