Amla Juice For Bad Cholesterol: ఉసిరి ఎన్నో రకాల ఔషధ గుణాలు లభిస్తాయి. ప్రతి రోజు వీటిని ఆహారాల్లో తీసుకోవడం వల్ల చాలా రకాల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా ఇందులో విటమిన్ సితో పాటు ఐరన్, ఫాస్పరస్, కాల్షియం పుష్కలంగా లభిస్తుంది. అయితే ఉసిరి కాయలను జ్యూస్‌లా తయారు చేసుకుని తాగడం వల్ల చర్మతో పాటు అన్ని రకాల జుట్టు సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఈ రసాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఈ సమస్యలే తగ్గడమేకాకుండా చాలా రకాల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ రసాన్ని తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ కింది సమస్యల నుంచి ఉపశమనం:
జీర్ణక్రియ సమస్యలకు చెక్:
ప్రస్తుతం చాలా మంది స్ట్రీట్ ఫుడ్స్ అతిగా తీసుకుంటున్నారు. దీని కారణంగా పొట్ట సమస్యలకు గురవుతున్నారు. అంతేకాకుండా కొంతమందిలో జీర్ణక్రియ కూడా దెబ్బతింటుంది. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు క్రమం తప్పకుండా ఉసిరి రసం తాగాల్సి ఉంటుంది.
కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది:
అతిగా ఆల్కాహాల్ తీసుకోవడం వల్ల చాలా మందిలో కాలేయం దెబ్బతింటుంది. అంతేకాకుండా కొంత మందిలో కాలేయంపై కొవ్వు పేరుకుపోతోంది. అయితే ఇలాంటి సమస్యల కారణంగా కాలేయ పని తీరులో మార్పులు వస్తున్నాయి. ఇలాంటి సమస్యల నుంచి కూడా ఉసిరి రసం ప్రభావంతంగా సహాయపడుతుంది.
Also Read: Minister KTR: వారికి సెలవులు రద్దు.. అధికారులకు కేటీఆర్ కీలక ఆదేశాలు
రోగనిరోధక శక్తిని పెంచుతుంది:
ఉసిరిలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి తరచుగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు, రోగనిరోధక శక్తి లోపం సమస్యలతో బాధపడేవారు ఉసిరి రసం ప్రతి రోజు తాగాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు ఫ్లూ, ఇన్ఫెక్షన్ల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగిస్తాయి.
కొలెస్ట్రాల్‌లకు చెక్ పెడుతుంది:
ఆధునిక జీవనశైలికి అలవాటు పడినవారిలో కొలెస్ట్రాల్ పెరగడం సర్వసాధరణంగా మారింది. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు క్రమం తప్పకుండా 500 మి.లీ ఉసిరి రసాన్ని తాగాల్సి ఉంటుంది. ఇలా 3 నుంచి 4 నెలల పాటు తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా సహాయపడుతుంది.
Also Read: Minister KTR: వారికి సెలవులు రద్దు.. అధికారులకు కేటీఆర్ కీలక ఆదేశాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి