Atukula Payasam Recipe In Telugu: ప్రతి శుక్రవారం అమ్మవారికి నైవేద్యంలో భాగంగా చాలామంది అటుకులతో తయారుచేసిన పాయాసాన్ని సమర్పిస్తూ ఉంటారు. భారతీయులకు ఈ రెసిపీ ఎంతో ప్రత్యేకమైనది. ముఖ్యంగా తెలంగాణతో పోలిస్తే ఎక్కువగా ఆంధ్రాలో ఈ రెసిపీని వినియోగిస్తూ ఉంటారు. ప్రతి ఫంక్షన్లో లేదా స్నాక్‌గా కూడా దీనిని తయారు చేసుకుంటూ ఉంటారు. రోజు అన్నం తిన్న తర్వాత ఈ పాయసాన్ని తీసుకోవడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు అనేక రకాల పొట్ట సమస్యల నుంచి విముక్తి కలిగించడమే కాకుండా ఎముకలను దృఢంగా చేసేందుకు కూడా కీలకపాత్ర పోషిస్తాయట. అందుకే చాలామంది పూర్వీకులు ఈ పాయసాన్ని ఎక్కువగా తీసుకునేవారని సమాచారం. అయితే దీనిని తయారు చేసుకునే క్రమంలో చాలామంది చిన్న చిన్న పొరపాట్లు పడడం వల్ల అటుకుల పాయసాన్ని సరైన రుచితో పొందలేకపోతున్నారు. ఇలా మేం చెప్పిన కొలతల్లో చేసుకొని తింటే ఉంటుంది.. రుచి వేరే లెవెల్.. అయితే ఈ పాయసాన్ని తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు ఏంటో? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
కావలసిన పదార్థాలు:
అటుకులు (పోహా) - 1 కప్పు
పాలు - 2 కప్పులు
చక్కెర - 1/2 కప్పు (లేదా రుచికి తగినంత)
నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు
బాదం, పిస్తా - కొద్దిగా (చిన్న ముక్కలుగా తరిగినవి)
కేసరి - చిటికెడు
ఎలకపిడుగు - చిటికెడు
తులసి ఆకులు - కొద్దిగా
తయారీ విధానం:
ముందుగా అటుకుల పాయసాన్ని తయారు చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని అందులో నెయ్యి వేసుకొని కొద్దిసేపు దాకా సన్నని ఫ్లేమ్ లో వేడి చేసుకోవాల్సి ఉంటుంది.
ఆ తర్వాత అందులో అటుకులు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు సన్నని సెగపై అటు ఇటు కలుపుతూ వేయించుకోవాల్సి ఉంటుంది.
ఆ తర్వాత స్టవ్ పై మరో పాత్ర పెట్టుకొని అందులో పాలు పోసుకుని వాటి రంగు మారేంతవరకు సన్నని సెగ పైనే ఉడికించుకోవలసి ఉంటుంది.
అదే పాలలో తగినంత చక్కెర వేసుకొని మరికొద్ది సేపు బాగా ఉడికించుకోవాల్సి ఉంటుంది. ఇలా ఉడికిన తర్వాత పాలలో అటుకులు వేసుకొని మరికొంతసేపు ఉడికించుకోండి.
బాగా ఉడుకుతున్న సమయంలో పైన పదార్థాలన్నీ వేసుకొని మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత తరిగిన బాదం పిస్తా, పలుకులు వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి.
ఇలా తయారు చేసుకున్న అటుకుల పాయసాన్ని గంటసేపు ఫ్రిజ్లో పెట్టుకొని సర్వ్ చేసుకుంటే రుచి వేరే లెవెల్ గా ఉంటుంది.
చిట్కాలు:
ఈ పాయసాన్ని తయారు చేసుకునే క్రమంలో అటుకులకు బదులుగా అన్నాన్ని కూడా వినియోగించవచ్చట.
అటుకుల పాయసం తయారు చేసుకునే క్రమంలో అటుకులు బాగా నెయ్యిలో వేగితేనే మంచి టేస్ట్ ను పొందుతారు.
ఈ అటుకుల పాయసంలో ద్రాక్షతోపాటు ఇతర డ్రైఫ్రూట్స్, డేట్స్ ఎక్కువగా వినియోగించడం వల్ల కూడా రుచి మారే అవకాశాలు ఉన్నాయి.
దీనిని రెండు విధాలుగా సర్వ్ చేసుకోవచ్చు.. వేడివేడిగా సర్వ్ చేసుకుని తీసుకోవడం వల్ల కొంత రుచి పొందినప్పటికీ.. ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తీసుకుంటే అద్భుతమైన రుచిని పొందుతారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
Atukula Payasam Recipe: అటుకుల పాయసం అంటే ప్రాణమా? ఎంతో సులభంగా ఇలా తయారు చేసుకోండి..