'మాహిష్మతి' రాజ్యంలో ఒకరోజు

మాహిష్మతి రాజ్యంలోకి వెళ్లాలనుకుంటున్నారా? అక్కడ ఒకరోజు ఉండాలనుకుంటున్నారా? అయితే ఈ విశేషాలు తెలుసుకోండి.

Last Updated : Nov 18, 2017, 04:12 PM IST
'మాహిష్మతి' రాజ్యంలో ఒకరోజు

బాహుబలి.. మాహిష్మతి రాజ్యం.. అద్భుతమైన భవంతులు, రాజమందిరాలు, గుళ్లు, జలపాతాలు అబ్బబ్బ చూడటానికి రెండుకళ్ళూ చాలవు. ఏంటీ కలగంటున్నావ్ అనుకుంటున్నారా? అయితే మీకు ఈ విషయం తెలియదనుకుంటా..!

ఎస్.ఎస్.రాజమౌళి తీసిన సినిమాల్లో బాక్స్ ఆఫీస్ వద్ద మొదటిరోజు నుంచి భారీవసూళ్లు సాధించిన సినిమా బాహుబలి. సినిమా అంత ఒకెత్తైతే, మాహిష్మతి రాజ్యం మరోఎత్తు. ఏం రాజ్యం అది! భవంతులు, కోటలు, మెట్లు, శిల్పాలు.. అబ్బో ఇలా ఎన్నో. అవన్నీ చూస్తున్నంత సేపు అరెరే నేనూ అక్కడ ఉండిటేనా? అని ఊహించుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు ఆ ఊహ నిజం కానుంది. మీరూ మాహిష్మతి రాజ్యంలో అడుగుపెట్టవచ్చు. జోక్ కాదు.. నిజమే!

బాహుబలి సెట్లు ఇప్పుడు హైదరాబాద్ లో ఒక ప్రధాన పర్యాటక ఆకర్షణ. రామోజీ ఫిల్మ్ సిటీలో ఉన్న ఈ సెట్లు రూ.60 కోట్లు ఉంటాయని అంచనా. బాహుబలి నిర్మాతలు అభిమానులకు, పర్యాటకులకు థ్రిల్ ఇవ్వడానికి ఈ అద్భుతమైన సెట్టింగ్ ను కొన్ని రోజులపాటు సందర్శనార్థం ఉంచనున్నారు. సెట్టింగులు ఒక్కటే కాదు.. సినిమాకు చెందిన అనేక వస్తువులను ప్రదర్శనకు ఉంచారు. అక్కడ మీరు అమరేంద్ర బాహుబలి దుస్తులు వేసుకోవచ్చు. సెట్టింగ్ ల వద్ద నిలబడి ఫొటోలు, సెల్ఫీలు తీసుకోవచ్చు. స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి ఒకరోజు హాయిగా, ఆనందంగా మాహిష్మతి రాజ్యంలో కలియతిరగవచ్చు.

మాహిష్మతి రాజ్యంలో ఒకరోజు గడపాలనుకొనేవారు ముందుగా రామోజీ ఫిలిం సిటీలో ఆన్లైన్ టికెట్ బుక్ చేసుకోవాలి లేదా అక్కడికి వెళ్లి కూడా తీసుకోవచ్చు.

బాహుబలి ప్రీమియం ఎక్సపీరియెన్స్ 

  • లోనికి ప్రవేశం: ఉదయం 9:30 నుండి 11:30 వరకు మాత్రమే. టికెట్ 11:30am టైం లోపలే తీసుకోవాలి.
  • టికెట్ ధర: పెద్దవారికి రూ.2349/-, పిల్లలకు రూ.2149/- 
  • వ్యాలిడిటీ: 30-10-2017 నుండి 14-12-2017 వరకు

ఈ ప్యాకేజీ రామోజీ ఫిలిం సిటీ టూర్ లోనే కలిపి లభిస్తుంది. ఈ పర్యటనలో భాగమైన బాహుబలి సెట్ టూర్ కోసం చివరి బస్సు సాయంత్రం 4 గంటలకు బయలుదేరుతుంది. ప్యాకేజీలో భాగంగా బఫెట్ భోజనం, సాయంత్రం టీ / కాఫీ అందిస్తారు. ట్విస్టర్ అండ్  రేంజర్, చైల్డ్ ప్లే ఏరియా, ఎకో- జోన్ సందర్శన, స్పిరిట్ ఆఫ్ రామోజీ మరియు లైట్స్ కెమెరా యాక్షన్ వంటి వినోద కార్యక్రమాలు వంటి ఆకర్షణీయమైన సవారీలు ఉన్నాయి.

Trending News