Summer Oily Skin Tips: వేసవి ఎండలు మీ చర్మాన్ని మరింత జిడ్డుగా మార్చేస్తాయి. దీని కారణంగా చర్మ సమస్యల బారిన పడాల్సి ఉంటుంది. అయితే దీని కోసం చాలా మంది మార్కెట్ లో లభించే క్రీములను, ప్రొడెక్ట్స్‌ను ఉపయోగిస్తుంటారు. అయితే మీరు ఎలాంటి ఖర్చు చేయకుండా ఇంట్లోనే తయారు చేసుకునే సహజ ప్యాక్‌లు ఉన్నాయి. దీని ఉపయోగించడం వల్ల చర్మం కాంతివంతంగా తయారు అవుతుంది. అలాగే దీనివల్ల మొటిమలు అనేక ఇతర సమస్యల దూరం అవుతాయి.
జిడ్డుగల చర్మం కోసం అద్భుతమైన ఫేస్ ప్యాక్స్:
జిడ్డుగల చర్మం చాలా మందిని ఇబ్బంది పెడుతుంది. కానీ సహజమైన పదార్థాలతో చేసిన ఫేస్ ప్యాక్స్‌తో ఈ సమస్యను అదుపు చేయవచ్చు. ఇంట్లోనే తయారు చేసుకోగలిగిన కొన్ని ఫేస్ ప్యాక్స్ ఇక్కడ ఉన్నాయి..
1. ముల్తానీ మట్టి- రోజా వాటర్:
ముల్తానీ మట్టి చమురును పీల్చుకునే గుణం కలిగి ఉంటుంది.
రోజా వాటర్ చర్మాన్ని టోన్ చేసి, చల్లదనాన్ని ఇస్తుంది.
ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్ ముల్తానీ మట్టి, 1 టేబుల్ స్పూన్ రోజా వాటర్‌తో కలపండి. దీని ముద్దగా అయ్యే వరకు కలపండి. ఆ తరువాత
ముఖానికి పూత చేసి 15-20 నిమిషాలు అలా ఉంచండి. చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి.
2. నిమ్మరసం-తేనె:
నిమ్మరసంలో ఉండే సిట్రిక్ ఆమ్లం చర్మాన్ని శుభ్రపరుస్తుంది. చర్మ రంధ్రాలను తెరుస్తుంది. తేనె చర్మాన్ని తేమగా ఉంచుతుంది.
ఒక గిన్నెలో 1 టేబుల్‌స్పూన్ నిమ్మరసం, 2 టేబుల్‌స్పూన్ల తేనె కలపండి. దీని ముద్దగా అయ్యే వరకు కలపండి. ముఖానికి పూత చేసి 10 నిమిషాలు అలా ఉంచండి. చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి.
3. బొబ్బట్టి కాయ-పెరుగు:
బొబ్బట్టి కాయ విటమిన్లు,మినరల్స్ ఉంటాయి. ఇది చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది.పెరుగు చర్మాన్ని చల్లబరుస్తుంది. మృదువుగా చేస్తుంది. ఒక గిన్నెలో 1 టేబుల్ స్పూన్ బొబ్బట్టి కాయ గుజ్జు, 2 టేబుల్‌స్పూన్ల పెరుగు కలపండి.దీని ముఖానికి పూత చేసి, 15 నిమిషాలు అలా ఉంచండి. చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి.
చిట్కా:
పైన చెప్పిన ఫేస్ ప్యాక్స్‌ని వారానికి 2-3 సార్లు వాడండి.
ఫేస్ ప్యాక్‌ని వాడే ముందు ముఖాన్ని శుభ్రం చేసుకోవడం ముఖ్యం.
కళ్ళ చుట్టూ ఉన్న ప్రాంతానికి ఫేస్ ప్యాక్ రాసుకోకుండా చూసుకోవాలి.
Also Read: Rooh Afza Recipe: వేడి వేసవికి చల్లని ఊరటని ఇచ్చే రూహ్ అఫ్జా షర్బత్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter