Chanakya Niti: చానక్యుడి నీతి.. ఇలా చేస్తే శత్రువైనా మీకు సలాం కొట్టాల్సిందే!

Chanakya Niti Quotes: సమాజంలో మనకు తగిన గౌరవంతో పాటు శత్రువు కూడా మనకు సలాం కొట్టే ఉపాయం ఒకటి ఉంది. అందుకోసం ఆచార్య చాణక్యుడు చెప్పిన మూడు సూత్రాలను పాటించాల్సి ఉంటుంది. వాటిని తూచా తప్పకుండా పాటించడం వల్ల ప్రతి రంగంలోనూ మీరు విజయవంతం అవ్వడం సహా శత్రువు కూడా మనల్ని ప్రశంసించే రోజు వస్తుంది. ఆ మూడు సూత్రాలేంటో తెలుసుకుందామా.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 6, 2022, 06:42 PM IST
Chanakya Niti: చానక్యుడి నీతి.. ఇలా చేస్తే శత్రువైనా మీకు సలాం కొట్టాల్సిందే!

Chanakya Niti Quotes: ప్రతి ఒక్కరు వారివారి జీవితాల్లో పదవి హోదా, డబ్బు, గౌరవం వంటి వాటి కోసం పాకులాడుతుంటారు. అయితే వాటిని పొందేందుకు వారికి ఉన్న అర్హతలను పరిశీలించుకోరు. ఎందుకంటే అదృష్టం కొద్ది మనకు దక్కిన ఫలితాలు మన దగ్గర ఎక్కువ కాలం ఉండవు. ఆచార్య చాణక్యుడు చెప్పిన చాణక్య నీతిలో ఈ మూడింటి గురించి ప్రస్తావించాడు. 

ఆ నీతి వాక్యాలను పాటిస్తే తాను పోగొట్టుకుంది తిరిగి పొందడం సహా సమాజంలో అతనికి అపారమైన గౌరవం లభిస్తుందని చాణక్య నీతి చెబుతోంది. దీని వల్ల శత్రువు కూడా ప్రశంసించే రోజు వస్తుందని దాని అర్థం. ఆ వాక్యాలను నిత్యం పాటించడం మూలానా.. డబ్బుతో పాటు విజయం సిద్ధిస్తుంది. 

ఆచార్య చాణక్యుడు చెప్పిన చాణక్య నీతిలో ఓ వ్యక్తికి కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి. ఆ ప్రత్యేకమైన బుద్ధిని చూసి.. శత్రువు కూడా తమకు తలవంచే రోజు వస్తుంది. జీవితంలో ఉన్నతస్థాయికి చేరాలంటే చాణక్యుడు చెప్పిన ఆ మూడు వాక్యాలు ఏమిటో తెలుసుకుందాం. 

ఎల్లవేళలా జ్ఞానంతో..

తెలివి, జ్ఞానం ఉన్న వ్యక్తికి ప్రతిచోటా గౌరవం లభిస్తుంది. అందువల్ల వయసులో ఎదిగే ప్రతిదశలోనూ వీలైనంత జ్ఞానాన్ని సంపాదించేందుకు ప్రయత్నించండి. జ్ఞానాన్ని పెంచుకోవడం సహా ఆ జ్ఞానాన్ని పంచుకోవడం కూడా ఎంతో ముఖ్యం. ఇలా చేయడం వల్ల శత్రువు కూడా మనల్ని గౌరవిస్తారు. 

సంస్కారవంతంగా మెలగాలి

ఓ వ్యక్తి నిజాయితీ, సంస్కారవంతంగా ఉంటే.. అతడిపై ఎలాంటి తప్పుడు ఆరోపణలు చేయడం సాధ్యం కాదు. అలాంటి పరిస్థితుల్లో ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా మీ శత్రువులు మీ ప్రతిష్ఠను దెబ్బతీయలేరు. 

సమర్ధవంతంగా..

ప్రతి పనిని ప్రేమిస్తూ.. లేదా తమదైన గొప్ప నైపుణ్యాలు చూపిస్తూ ఉన్న క్రమంలో వారిని అందులో నిష్ణాతులుగా భావిస్తారు. అలాంటి వారికి సంబంధిత రంగాల్లో గౌరవం లభించడం సహా డబ్బును త్వరగా పొందుతారు. ఆ నైపుణ్యాలు కూడా శత్రువును మెచ్చుకునేలా చేస్తాయి. 

(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం చాణక్య నీతి ద్వారా గ్రహించబడింది. ZEE NEWS వీటిని ధృవీకరించలేదు.) 

Also Read: Vastu Tips: వాస్తు ప్రకారం మీ ఇంట్లో బెడ్రూమ్ ఎక్కడుండాలి, ఎక్కడుండకూడదు, అలాగుంటే అంత ప్రమాదమా

Also Read: New Year Cake 2022: న్యూఇయర్ కోసం ఇంట్లోనే మ్యాంగో చీజ్ కేక్ తయారీ ఎలానో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News