Clay Pot Water Side Effects: వేసవిలో చాలామంది చల్లని నీటిని ఎక్కువగా తాగుతూ ఉంటారు. ఆధునిక జీవనశైలి కారణంగా చాలామంది ఇంట్లో ఎక్కువగా ఫ్రిజ్జును వినియోగించి కూల్ చేసుకున్న నీటిని తాగుతున్నారు. నిజానికి రిఫ్రిజిరేటర్‌లో ఉంచిన చల్లటి నీటిని తాగడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. గతంలో మన పూర్వీకులు అయితే వేసవికాలంలో మట్టికుండల్లో ఉంచిన నీటిని ఎక్కువగా తాగేవారు. వీటిల్లో నీటిని తాగడం వల్ల శరీరానికి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు బాడీలోని ఎలక్ట్రోలైట్ లోపాన్ని తొలగించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా మట్టికుండల నీటిని తాగడం వల్ల జీర్ణ క్రియ కూడా మెరుగుపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అయితే చాలామంది ఈ నీటిని తాగే క్రమంలో కొన్ని అజాగ్రత్తలు పాటిస్తున్నారు. దీని కారణంగా తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారని నిపుణులు తెలుపుతున్నారు. అయితే మట్టికుండల నీటిని తాగే క్రమంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఏయే సమయంలో ఈ నీటిని తాగాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
నీటిని నేరుగా గ్లాస్ తో తీయకండి:
చాలామంది ఎండాకాలంలో మట్టికుండల నీటిని తాగే క్రమంలో కొన్ని తప్పులు చేస్తున్నారు. దీనికి కారణంగా ఆ నీటి నుంచి వచ్చే పలు లాభాలు పొందలేకపోతున్నారని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. మట్టికుండను వినియోగించేవారు నీటిని కుండలో నుంచి నేరుగా చేతులతో ముంచకుండా బయటకు తీసి తాగడం చాలా మంచిది. ఎందుకంటే కుండలో నీటిని నేరుగా ముంచడం వల్ల చేతులకు ఉండే గోళ్ళ విషం నీటిలోకి ప్రవేశించే అవకాశాలున్నాయి. దీనికి కారణంగా అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చే ఛాన్స్ ఉందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
24 గంటలకు పైగా నీటిని తాగడం మంచిది కాదు:
మట్టి కుండలోని నీటిని ప్రతిరోజు తాగేవారు తప్పకుండా గుండెను ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడం చాలా మంచిది లేకపోతే గుండెలోని హానికరమైన బ్యాక్టీరియా పెరిగిపోయి. ఇన్ఫెక్షన్లు పొట్ట సమస్యలు టైఫాయిడ్ వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కుండలోని నీటిని తాగేవారు 12 గంటలకు పైగా ఉంచిన నీటిని తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఈ నీటిని తాగే వారు తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ప్రతిరోజు కుండను మట్టితో శుభ్రం చేయడం చాలా మంచిది.
మట్టి కుండ చుట్టూ చూపిన తట్టు బొంతను రోజూ కడగాలి:
చాలామంది మట్టి కుండలోని నీటిని చల్లగా చేసుకోవడానికి దాని చుట్టూ తట్టు బొంతను లేదా వస్త్రాన్ని చుడతారు. అయితే ఇలా చుట్టిన వస్త్రాన్ని ప్రతిరోజు శుభ్రం చేసుకోవడం చాలా మంచిదని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. లేకపోతే దీనివల్ల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా దానిపై ఫంగల్ పేరుకుపోయి ఇతర అనారోగ్య సమస్యలకు దారి తీసే ఛాన్సులు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి మట్టికుండకు వస్త్రాన్ని చుట్టిన వారు తప్పకుండా రోజు సబ్బుతో శుభ్రం చేసుకోవడం ఎంతో మంచిది.
మట్టి కుండ భాగాన్ని అస్సలు తెరిచి ఉంచకండి:
ప్రస్తుతం చాలామంది మట్టికుండను వినియోగించేవారు అందులో నీటిని నింపిన తర్వాత అలాగే వదిలేస్తూ ఉంటారు. అయితే ఈ మట్టి కుండ పైభాగం నుంచి దుమ్ము, ధూళి, క్రిమి కీటకాలు చేరే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి నీటిని ప్రతి రోజు తాగడం వల్ల ఇన్ఫెక్షన్లు ఇతర అనారోగ్య సమస్యల బారిన పడే ఛాన్స్ కూడా ఉందని వారు అంటున్నారు. కాబట్టి కుండలోని నీటిని నింపిన తర్వాత తప్పకుండా పైకప్పు పెట్టుకోవడం చాలా మంచిది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి