మధుమేహం లేదా డయాబెటీస్ అనేది జన్యుపరంగా కూడా కలుగుతుంది. సాధారణంగా ఈ వ్యాధి అనారోగ్యకర జీవన శైలి మరియు చెడు ఆహారపు అలవాట్ల వల్ల కలుగుతుంది. భారతదేశంలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఈ వ్యాధితో చాలా మంది బాధపడుతున్నారు.
మధుమేహం వల్ల అనేక ఇతర వ్యాధుల కూడా కలుగుతాయి. మధుమేహం వ్యాధిగ్రస్థుల్లో ఇన్సులిన్ ముఖ్య పాత్ర వహిస్తుంది. ఇన్సులిన్ అనేది ఒక హార్మోన్.. ఇది బ్లడ్ షుగర్ ని నియంత్రణలో ఉంచడంలో సహాయపడుతుంది. డయాబెటిస్ వల్ల ఇన్సులిన్ స్రావం పై ప్రభావం పడుతుంది. కావున బ్లడ్ షుగర్ ని నియంత్రించే కొన్ని సాధారణ ఔషదాల గురించి ఇపుడు తెలుసుకుందాం..
సాధారణంగా మన ఇళ్లల్లో.. మసాలా దినుసుగా ఉపయోగించే లవంగాలు షరీరంలో బ్లడ్ షుగర్ స్థాయి నియంత్రణలో ఉంచటానికి సహాయపడతాయి. డయాబెటిస్ ఉన్న వారు రోజు అనుసరించే డైట్ లో లవంగాలను చేర్చుకోవాలి. ఈ లవంగాలను వంట రుచిని పెంచడానికి ఉపయోగిస్తారు. ఈ లవంగాలను తినడం వల్ల బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉంటుందని మనలో కొంత మందికే తెలుసు. లవంగాలు డయాబెటిస్ రోగులకు ఎంతగానో ఉపయోగపడతాయి. లవంగాలు యాంటీ డయాబెటిక్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇన్ని ఔషధగుణాలు కలిగి ఉన్న లవంగాలు మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఎలా ఉపయోగపడతాయో ఇపుడు తెలుసుకుందాం.
Also Read: SA vs ENG: చెలరేగిన సఫారీ బ్యాటర్లు.. ఇంగ్లండ్ ముందు భారీ లక్ష్యం..
మధుమేహ వ్యాధిగ్రస్తులకు లవంగాల వల్ల కలిగే లాభాలు..
వంటల్లో ఉపయోగించే లవంగాలు యాంటీ డయాబెటిక్ గుణాలు ఉంటాయి. కావున లవంగాలతో చేసిన నూనెని తీసుకోవడం వల్ల ఇన్సులిన్ మరియు గ్లూకోస్ ప్రతిస్పందన విధానాన్ని మెరుగుపరుస్తాయి.
లవంగాలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ప్లీహా గ్రంథి పనితీరును మెరుగుపరచటంలో సహాయపడతాయి. ప్లీహ గ్రంధి అనేది మన శరీరంలో ఇన్సులిన్ ని ఉత్పత్తి చేసే అతి ముఖ్యమైన భాగం. కావున బ్లడ్ షుగర్ ని నియంత్రించుకోవడానికి రోజు లవంగాలను తినడం చాలా అవసరం.
లవంగాలను ఉపయోగించే విధానం..
- ముందుగా లవంగాలను మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
- తరువాత లవంగాల పొడిని ఒక కప్పు నీటిలో వేసి సుమారు 10 నిమిషాల పాటు మరిగించాలి.
- మరిగేటప్పుడు అందులో అర టీస్పూన్ టీపొడి వేసి కాసేపు అలాగే ఉంచాలి.
- తరువాత ఆ ద్రవాన్ని వడపోసి అది చల్లబడే వరకు వేచి ఉండాలి.
- ఆ ద్రవాన్ని తాగాలి.. దీని వల్ల బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉంటుంది.
Also Read: Mangalavaram Movie: భయపెడుతున్న పాయల్ రాజ్‍పుత్... ఉత్కంఠగా 'మంగళవారం' ట్రైలర్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..