Happy Diwali Wishes Cards Telugu: హ్యాపీ దీపావళి స్పెషల్ కోట్స్ అండ్ కార్డ్స్ మీకోసం..ఇలా సులభంగా మీ స్నేహితులకు పంపండి.

Happy Diwali Wishes Cards Telugu: ఈ దీపావళి శుభ సందర్భంగా మీ కుటుంబంలోని కష్టాలన్నీ తొలగిపోవాలని కోరుకుంటూ మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. అంతేకాకుండా ఇతరుల జీవితాల్లో కూడా వెలుగు నింపాలని కోరుకుంటూ వారికి మీ మందించే కార్డ్స్ రూపంలో శుభాకాంక్షలు తెలియజేయండి.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 12, 2023, 10:15 AM IST
Happy Diwali Wishes Cards Telugu: హ్యాపీ దీపావళి స్పెషల్ కోట్స్ అండ్ కార్డ్స్ మీకోసం..ఇలా సులభంగా మీ స్నేహితులకు పంపండి.

 

Happy Diwali Wishes Cards Telugu: పూర్వీకుల నుంచి దీపావళి పండగ రోజున లక్ష్మీదేవిని ఆరాధించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ పండగ రోజు భక్తులంతా సాయంత్రం పూట లక్ష్మీదేవి పూజలో పాల్గొంటారు. చెడుపై మంచి గెలిచినందుకుగాను, ప్రజల జీవితాల్లో చీకటి తొలగిపోయినందుకుగాను ఈ దీపావళి పండగను జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా దీపావళి పండగ వచ్చింది.

ఈ పండగ రోజు గ్రహాల స్థితులు మారడం కారణంగా కొన్ని ప్రత్యేక యోగాలు ఏర్పడ్డాయి. కాబట్టి ఈ పండగ ప్రాముఖ్యత మరింత పెరిగిందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి పండగ పర్వదినాన మీ స్నేహితుల కుటుంబాల్లోనూ మీ స్నేహితుల జీవితాల్లోనూ ఆ లక్ష్మీదేవి వెలుగులు నింపాలని కోరుకుంటూ.. వారికి దీపావళి శుభాకాంక్షలు ప్రత్యేక కార్డ్స్ ల రూపంలో తెలియజేయండి.


ఆ మహాలక్ష్మి దేవి అమ్మవారి దీవెనలు కష్టాసుకా సమయాల్లో మనసులో ఉండాలని కోరుకుంటూ.. మీ కుటుంబంలో ఆనందం రెట్టింపు అవ్వాలని ఆకాంక్షిస్తూ మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి ప్రత్యేక శుభాకాంక్షలు.

చీకటిని తొలగించే దీపాల వెలుగు మనుషుల కష్టాలను కూడా పారద్రోలాలని కోరుకుంటూ ఆ లక్ష్మీదేవి అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా మీపై ఉండాలని ఆకాంక్షిస్తూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీపాల పండుగ శుభాకాంక్షలు.

ఒక్కొక్క దీపపు వెలుగు చీకటి తొలగించినట్లే మనుషుల్లో ఉన్న అహంకారాన్ని కోపాన్ని పోగొట్టి, ప్రేమ వెలుగును నింపాలని ఆకాంక్షిస్తూ.. మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు.

జీవితంలో ఎదురయ్యే కష్టాలన్నీ తొలగిపోయి జీవితం బంగారు మయం కావాలని, ఈ ఏడాది పొడవునా లక్ష్మీదేవి అమ్మవారి కరుణాకటాక్షం లభించాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ దీపావళి శుభాకాంక్షలు.

దీపం వెలిగినట్లే బుద్ధి, ప్రేమ వెలగాలని కోరుకుంటూ.. ద్వేషం, కోపం నశించి ప్రేమ అభిమానాలు పెరగాలని ఆకాంక్షిస్తూ..మిమ్మల్ని ఇష్టపడే వారందరికీ దీపావళి శుభాకాంక్షలు.

అజ్ఞానం, అంధకారం నశించి ప్రపంచమంతా శాంతి మయంగా మారాలని కోరుకుంటూ, కష్టాల చీకటి కరిగిపోయి సుఖాల దీపాల వెలుగు లభించాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు.

Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News