Best Leaves For Sugar Control: ఆధునిక జీవనశైలిలో చోటు చేసుకున్న మార్పుల కారణంగా వయసుతో సంబంధం లేకుండా పలు అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ముఖ్యంగా డయబెటిస్ సమస్య బారిన పడుతున్నారు. ఈ సమస్య వచ్చని వారు జీవిత కాలం పాటు మందులను వాడుతూనే ఉండాలి. అయితే షుగర్ కంట్రోల్ చేయడంలో కేవలం మందులు కాకుండా సహజంగా కొన్ని పద్ధతులతో కూడా ఈ సమస్య నుంచి బయట బయటపడవచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
అందులో ముఖ్యంగా వేప ఆకు తీసుకోవడం వల్ల షుగర్ ను కంట్రోల్ చేయడానికి చాలా సహాయపడుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఈ ఆకులు తీసుకోవడం వల్ల గ్లూకోజ్ లెవెల్స్ కంట్రోల్ ఉంటాయి. ఈ వేప ఆకులను నీటితో కలిపి తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్‌తక్కువ అవుతాయి.
మెంతి ఆకులు తీసుకోవడం వల్ల కూడా ఈ షుగర్ వ్యాధిని తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే యాంటీ డయాబెటిక్ ఎలిమెంట్స్ డయాబెటిస్ కంట్రోల్ చేయాడంలో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా గ్లూకోస్ లెవెల్స్ కంట్రోల్‌లో ఉంటాయి.
తులసి ఆకులు తీసుకోవడం వల్ల షుగర్ కంట్రోల్ చేయడంలో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. తులసి ఆకులు తీసుకోవడం వల్ల యాంటీ డయాబెటిక్ ఎలిమెంట్స్ అధికంగా లభిస్తాయి.
స్టెవియా ఆకులో సహజ స్వీట్నర్ కలిగి ఉంటుంది. దీని ఇతర ఆహారాలలో తీపిని పెంచడంలో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇది గ్లూకోజ్ లెవెల్స్ ని కంట్రోల్ చేయడంలో సహాయపడుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
Also read: Skin Care Tips: చర్మం సంరక్షణ, నిగారింపు కోసం పాటించాల్సిన టిప్స్
టర్నిప్ ఆకులో అధిక ఫైబర్ కలిగి ఉంటుంది. ప్రతి రోజు ఆహారంలో టర్నిఫ్ ఆకులు తీసుకోవడం వల్ల టైప్-1 డయాబెటిస్ సమస్య నుంచి బయటపడవచ్చు. అంతేకాకుండా షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేస్తుంది.
ఈ విధంగా షుగర్ సమస్యతో బాధపడుతున్నవారు ఈ ఆకులను తీసుకోవడం వల్ల షుగర్ కి చెక్ పెట్టవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి మీరు కూడా తప్పకుండా ఈ ఆకులని వాడండిని నిపుణులు సూచిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter