Hair Tips: మీ కేశాలు అందంగా, మృదువుగా, నిగనిగలాడాలంటే ఇలా చేయండి చాలు

Hair Tips: కేశాలు అందంగా, నిగనిగలాడుతుండాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కానీ చెడు ఆహారపు అలవాట్లు, కాలుష్యం ఇలా చాలా కారణాలతో ఇది సాధ్యం కాదు సరికదా..కళా విహీనమై అంద వికారంగా మారుతుంటాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 21, 2023, 07:02 PM IST
Hair Tips: మీ కేశాలు అందంగా, మృదువుగా, నిగనిగలాడాలంటే ఇలా చేయండి చాలు

Hair Tips: కేశాలను ఆరోగ్యంగా ఉంచుకోవడం పూర్తిగా మన చేతుల్లోనే ఉందంటారు నిపుణులు. కేశాలు అందంగా, మృదువుగా, నిగనిగలాడుతుంటే కచ్చితంగా అందం రెట్టింపవుతుంటుంది. కేశాలు సిల్కీగా, షైనీగా ఉండాలంంటే కొన్ని చిట్కాలు పాటిస్తే సాధ్యమేనంటున్నారు. 

కేశాలు సిల్కీగా, షైనీగా ఉండాలంటే ముందు ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో మార్పు రావాలి. మార్కెట్‌లో లభించే కెమికల్ ఆధారిత ఉత్పత్తులు వాడితే పెద్దగా ప్రయోజనం ఉండకపోగా ప్రతికూల ప్రభావం పడుతుంటుంది. అందుకే కేశాల నిగారింపు, బలం, మృదుత్వం కోసం ఇంట్లోనే కొన్ని చిట్కాలతో సాధించవచ్చు. 

ఫ్లక్స్ సీడ్స్ ఇందుకు అద్భుతంగా పనిచేస్తుంది. ఫ్లక్స్ సీడ్స్‌ను విభిన్నరకాలుగా ఆహారం, బ్యూటీ ఉత్పత్తుల్లో వినియోగిస్తారు. ఫ్లక్స్ సీడ్స్‌లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ , ఫైబర్, ప్రోటీన్లు ఇతర పోషకాల కారణంగా కేశాలు ఆరోగ్యంగా మారతాయి,. మీ కేశాలు మృదువుగా, నిగనిగలాడేందుకు దోహదపడతాయి. ఇంట్లోనే మీరు చాలా సులభంగా ఫ్లక్స్ సీడ్స్ హెయిర్ జెల్ తయారు చేసుకోవచ్చు. ఇది అత్యంత సహజసిద్ధమైంది, సురక్షితమైంది. అంటే జుట్టు రాలిపోవడం ఇతర రియాక్షన్స్ ఏవీ ఉండవు. 

ముందుగా 2 చెంచాల ఫ్లక్స్ సీడ్స్ తీసుకోవాలి. ఓ మిక్సీలో వేసి పౌడర్ చేసుకోవాలి. పావు కప్పు నీళ్లలో ఈ పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఓ గిన్నెలో వేసి మీడియం ఫ్లేమ్‌లో వేడి చేయాలి. ఈ మిశ్రమంగా గాఢంగా మారాక స్టవ్ ఆర్పేయాలి. చిన్న గిన్నెలో తీసుకుని చల్లార్చాలి. పూర్తిగా చల్లారిన తరువాత కేశాలకు బాగా రాసుకోవాలి. ఇలా వారానికి 3-4 సార్లు చేయడం వల్ల మీ కేశాలు మృదువుగా, నిగనిగలాడతాయి.కేశాలను డాండ్రఫ్ నుంచి కాపాడుతుంది. జట్టు రాలకుండా కాపాడుతుంది. 

Also read: Diabetes Home Remedies: కిచెన్‌లో లభించే ఈ మూడు పదార్ధాలు చాలు మధుమేహం ఎంత ఉన్నా ఇట్టే మాయం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News