White Hair: తెల్లజుట్టు నల్లగా మారాలంటే...రోజూ ఈ జ్యూస్‌లు తాగితే చాలు

White Hair: అందంగా ఉండాలని ఎవరికుండదు. కానీ నెరిసిన జుట్టు అందాన్ని తగ్గించేస్తుంది. తెల్ల వెంట్రుకలు తగ్గించేందుకు, మెరిసే చర్మం కోసం కొన్ని టిప్స్ మీ కోసం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 13, 2022, 10:49 PM IST
White Hair: తెల్లజుట్టు నల్లగా మారాలంటే...రోజూ ఈ జ్యూస్‌లు తాగితే చాలు

White Hair: అందంగా ఉండాలని ఎవరికుండదు. కానీ నెరిసిన జుట్టు అందాన్ని తగ్గించేస్తుంది. తెల్ల వెంట్రుకలు తగ్గించేందుకు, మెరిసే చర్మం కోసం కొన్ని టిప్స్ మీ కోసం..

అందం ఆరోగ్యం కూడా. అందంగా ఉండాలంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖం ఒక్కటే కేర్ తీసుకుంటే సరిపోదు..జుట్టు నెరవకుండా చూసుకోవాలి. లేకపోతే నెరిసిన జుట్టు మీ అందాన్ని తగ్గించేస్తుంది. తక్కువ వయస్సులోనే వృద్ధాప్య ఛాయలు వచ్చేస్తాయి. అందుకే జుట్టు నెరవకుండా..మృదువుగా ఉండాలంటే కొన్ని టిప్స్ పాటించాల్సిందే. ఈ సమస్యల పరిష్కారం కోసం మార్కెట్‌లో లభించే ఉత్పత్తుల్ని వినియోగిస్తే దుష్పరిణాలు ఎదురుకావచ్చు. జుట్టు రాలడం, చర్మం పాడవడం వంటి సమస్యలుంటాయి. హెల్తీ స్కిన్, నల్లని జుట్టు కావాలంటే..కొన్ని రకాల జ్యూస్‌లు మీ డైట్‌లో చేర్చుకోవల్సిందే. ఎలాంటి జ్యూస్‌లు తాగాలో తెలుసుకుందాం..

పాలకూర చాలా రకాల పోషకాలతో నిండుకుని ఉంటుంది. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ సి, ఐరన్ సమృద్ధిగా ఉంటాయి. దీనివల్ల మీ చర్మం ప్రకాశవంతంగా, యౌవ్వనంగా ఉంటుంది. దాంతోపాటు మీ జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది. దీనికోసం పాలకూర జ్యూస్ తాగితే మంచి ఫలితాలుంటాయి. ఇందులో ఇతర కూరగాయలు కూడా కలపవచ్చు.

ఇక సీడ్స్ మిశ్రమం కూడా మంచి ఔషధం. చియా, నువ్వులు, సన్‌ఫ్లవర్ , ఆనపకాయ గింజల్ని తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనముంటుంది. ఇవి మీ చర్మాన్ని, జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి. చర్మానికి సహజసిద్ధమైన గ్లో ఇస్తాయి. దాంతోపాటు జుట్టుని బలోపేతం చేస్తాయి. దానిమ్మ జ్యూస్ అనేది చర్మ సౌందర్యానికి, జుట్టు సంరక్షణకు చాలా దోహదపడుతుంది. ఇందులో పుష్కలంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యూనిక్ యాసిడ్ చర్మ సంబంధిత సమస్యల్ని దూరం చేసి..కాంతివంతంగా మారుస్తుంది. అటు జుట్టు కూడా సహజసిద్ధమైన రంగులో మెరుస్తుంటుంది. అయితే ప్రతిరోజూ క్రమం తప్పకుండా నిర్ణీత మోతాదులో పరిమితి దాటకుండా తీసుకోవాలి. 

Also read: Dark Circles: కంటి కింద నల్లటి వలయాలతో ఇబ్బంది పడుతున్నారా..ఇవి అప్లై చేయండి చాలు

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News