Hemp Seeds For Weight Loss: జనపనార విత్తనాల వల్ల శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..!

Hemp Seeds For Weight Loss: జనపనార విత్తనాలు శరీరానికి చాలా రకాల ప్రయోజనాలను చేకూర్చుతాయి. ఇందులో టెట్రాహైడ్రోకాన్నబినాల్ (THC) అనే పదార్థం చాలా తక్కువ పరిమాణంలో ఉంటుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 18, 2022, 02:53 PM IST
  • జనపనార విత్తనాల వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు
  • ఇందులో ప్రొటీన్స్‌ సమృద్ధిగా ఉంటాయి
  • జీవక్రియను మెరుగుపడుతుంది
Hemp Seeds For Weight Loss: జనపనార విత్తనాల వల్ల శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..!

Hemp Seeds For Weight Loss: జనపనార విత్తనాలు శరీరానికి చాలా రకాల ప్రయోజనాలను చేకూర్చుతాయి. ఇందులో టెట్రాహైడ్రోకాన్నబినాల్ (THC) అనే పదార్థం చాలా తక్కువ పరిమాణంలో ఉంటుంది. జనపనార గింజలు బరువును తగ్గించడానికి చాలా ప్రభావవంతంగా పని చేస్తాయి. ఈ విత్తనాలు పోషకాలు, విటమిన్లతో నిండి ఉంటాయి. కావున జీర్ణవ్యవస్థను బలంగా చేసేందుకు కృషి చేస్తాయి. ఇందులో ఫైబర్ అధిక మోతాదులో ఉంటుంది. శరీరానికి వివిధ రకాల వ్యాధుల నుంచి రక్షిస్తుంది. దిని వల్ల కలిగే ఇతర ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం..

జనపనార విత్తనాలను ఎలా తినాలి:
ఈ విత్తనాలను వివిధ రకాల వంటకాలతో కలపి వండుకోవచ్చు. వీటిని పెరుగులో నానబెట్టుకుని కూడా తినొచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీనిని కొబ్బరి, చక్కెర కలుపుకుని తినొచ్చు. అంతేకాకుండా సలాడ్‌లో కూడా వినియోగించవచ్చని నిపుణులు పేర్కొన్నారు.

జనపనార విత్తనాలు బరువును ఎలా తగ్గిస్తాయి..?

1. ఇందులో ప్రొటీన్స్‌ సమృద్ధిగా ఉంటాయి:

జనపనార గింజల్లో ఎక్కువ మోతాదులో ప్రొటీన్లు ఉంటాయి. అంతేకాకుండా ఇందులో 9 రకాల అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రోటీన్ పౌడర్‌కు బదులుగా జనపనార విత్తనాలను ఉపయోగించవచ్చని నిపుణులు తెలుపుతున్నారు.

2. జీవక్రియను మెరుగుపడుతుంది:

చేప నూనెలో ఉండే అన్ని పోషకాలను హెంప్ ఆయిల్‌లో ఉంటాయి. ఇది ప్రేగుల సామర్థ్యాన్నిపెంచేందుకు కృషి చేస్తుంది. ఈ నూనెను వినియోగించడం వల్ల జీవక్రియ బలంగా మారుతుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

3. శరీరానికి కొవ్వులను అందిస్తుంది:

జనపనార గింజల్లో అవసరమైన కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. అంతేకాకుండా ఇందులో ఒమేగా-3 పుష్కలంగా ఉంటుంది. ఇవి బరువును తగ్గించేందుకు దోహదపడతాయి.

4. కీటో డైట్‌కి మంచిది:

కీటో డైట్‌ని అనుసరించే వారికి జనపనార గింజలు చాలా మేలు చేస్తాయి. 3 టేబుల్ స్పూన్ల విత్తనాలలో 2 గ్రాముల పిండి పదార్థాలు వేసి క్రమం తప్పకుండా ఆహారంగా తీసుకోవాలి.

Also Read: Dehydration Symptoms On Skin: శరీరంలో నీరు కొరతగా ఉంటే ఈ చర్మ సమస్యలు తప్పవు..!

Also Read: Weight Gain Tips: బరువు పెరగాలనుకుంటున్నారా.. అయితే ఇలా చేయండి..!

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News