Homemade Oil For Baldness: వాతావరణంలో తీవ్ర మార్పుల కారణంగా జుట్టు పల్చబడటం, జుట్టు రాలడం వంటి సమస్యల బారిన పడుతున్నారు. చాలా మందిలో ఒత్తిడి కారణంగా కూడా జుట్టు రాలి, బట్టతల సమస్యలు వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా జుట్టుకు ఉల్లిపాయ సీరం వినియోగించాల్సి ఉంటుంది. దీని వినియోగించడం వల్ల జుట్టు ఒత్తుగా, పొడవాటిగా తయారవుతుందని నిపుణులు అంటున్నారు. ఇందులో ఉండే ఆయుర్వేద గుణాలు చాలా రకాల జుట్టు సమస్యలకు సహాయపడుతుంది. ముఖ్యంగా బట్టల సమస్యలతో బాధపడుతున్నవారికి ప్రభావంతంగా సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే దీనిని వినియోగించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉల్లిపాయ సీరం జుట్టును పెంచేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా ఇందులో సల్ఫర్, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి దీనిని వినియోగించడం వల్ల జుట్టు ఆరోగ్యంగా తయారవుతుంది. ఈ సీరమ్ హెయిర్ ఫోలికల్స్‌ను పోషించడానికి కూడా కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే ఆయుర్వేద గుణాలు జుట్టు రాలకుండా సహాయపడుతుంది.
Also read: Hair Mask: డేండ్రఫ్ సమస్యను సమూలంగా తొలగించే హోమ్ మేడ్ హెయిర్ మాస్క్ ఇదే
జుట్టు రాలడాన్ని నివారిస్తుంది:
జుట్టును ఆరోగ్యంగా చేసేందుకు ఉల్లిపాయ సీరం ప్రభావంతంగా సహాయపడుతుంది. ఇందులో ఉండే యాంటీమైక్రోబయల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు జుట్టు రాలడాన్ని సులభంగా తగ్గిస్తాయి. అంతేకాకుండా జుట్టులో ఇన్ఫెక్షన్స్ను ఉల్లిపాయ సీరం వినియోగించడం వల్ల సులభంగా ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా చుండ్రు లేదా స్కాల్ప్ ఇన్ఫెక్షన్ల వంటి సమస్యలను తగ్గించడానికి కూడా సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
బట్టతల సమస్యలకు చెక్:
శరీరంలో పోషకాల లోపం వల్ల బట్టతల సమస్యలు వస్తున్నాయి. అంతేకాకుండా చాలా మందిలో ఒత్తిడి కారణంగా కూడా ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. అయితే ఈ బట్టతల సమస్య నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి తప్పకుండా ఉల్లిపాయ సీరం వినియోగించాల్సి ఉంటుంది. దీనిని వినియోగించడం వల్ల సులభంగా జుట్టు రాలడం సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇందులో ఉండే ఆయుర్వేద గుణాలు జుట్టును ఆరోగ్యంగా ఉంచేందుకు కూడా సహాయపడుతుంది.
Also read: Hair Mask: డేండ్రఫ్ సమస్యను సమూలంగా తొలగించే హోమ్ మేడ్ హెయిర్ మాస్క్ ఇదే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook