Get Rid of Tan: ఈ సీజన్లో 3 పదార్థాలతో ప్యాక్ వేసుకోండి.. ఖరీదైన క్రీములు అవసరమే లేదు..

Get Rid of Tan: మండే ఎండలో ముఖంపై ట్యాన్ పేరుకుంటుంది. దీన్ని సులభంగా అధిగమించడానికి ఎన్నో ఖరీదైన క్రీములను వాడతాం. అది టెంపరెరీగా పనిచేస్తుంది. కానీ, శాశ్వత ఉపశమనం ఇవ్వదు.

Written by - Renuka Godugu | Last Updated : Mar 24, 2024, 09:11 AM IST
Get Rid of Tan: ఈ సీజన్లో 3 పదార్థాలతో ప్యాక్ వేసుకోండి.. ఖరీదైన క్రీములు అవసరమే లేదు..

Get Rid of Tan: మండే ఎండలో ముఖంపై ట్యాన్ పేరుకుంటుంది. దీన్ని సులభంగా అధిగమించడానికి ఎన్నో ఖరీదైన క్రీములను వాడతాం. అది టెంపరెరీగా పనిచేస్తుంది. కానీ, శాశ్వత ఉపశమనం ఇవ్వదు. అయితే, ఖరీదైన క్రీముల కంటే ఇంట్లోని కొన్ని రెమిడీస్ వాడితే ఖర్చు లేకుండానే ముఖంపై పేరుకున్న ట్యాన్ తొలగించుకోవచ్చు. అంతేకాదు, వీటితో నేచురల్ గ్లో కూడా వస్తుంది. 

మండుతున్న ఎండలో ఏ కాస్త సూర్యుని ప్రభావానికి లోనైనా ముఖంపై ట్యాన్ పేరుకుంటుంది. దీంతో ముఖం అందవిహీనంగా కూడా మారుతుంది. పట్టించుకోకుండా అలాగే వదిలేస్తే ముఖం డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. అయితే, ఇంట్లో అందుబాటులో ఉండే శనగపిండితో మనం ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవాలి. ఇది ముఖాన్ని మృదువుగా చేయడంతోపాటు మెరిపిస్తుంది. ముఖంపై ఫేస్‌ ప్యాక్ వేసుకునే ముందు స్క్రబ్ చేసుకోవాలి. దీనికి తేనె, చక్కెర వినియోగించిన సరిపోతుంది. చక్కెరను కాస్త రవ్వ మాదిరి పొడి చేసుకోవాలి. ఇది అప్పుడప్పుడు ముఖం పై స్క్రబ్ చేసుకోవాలి. ఇక ప్యాక్ శనగపిండి, పసుపు నిమ్మరసం, పాలు వేసి ప్యాక్ తయారు చేసుకోవాలి. దీంతో ముఖంపై ప్యాక్ వేసుకోవాలి. 

ప్యాక్ తయారీకి కావాల్సిన పదార్థాలు..
శనగపిండి ఒక స్పూన్
ముల్తానీ మట్టి స్పూన్
నిమ్మరసం
పసుపు చిటికెడు

ఇదీ చదవండి: మసాలా ఎక్కువగా ఉండే ఆహారం తింటున్నారా? అయితే, ఈ వ్యాధులు మీకోసం ఎదురుచూస్తున్నాయి..

ఈ పదార్థాలన్నింటినీ కలిపి పేస్ట్ తయారు చేసుకోవాలి. ముఖానికి అప్ఐల చేసుకుని ఓ 15 నిమిషాలు ఆరిన త్వరాత ముఖం కడిగితే సరిపోతుంది. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే ముఖంపై పేరుకున్న ట్యాన్ తొలగిపోతుంది.

ఇదీ చదవండి: ఖర్జూరం మగవారికి ఆ విషయంలో ఎంతో ప్రత్యేకం.. నెయ్యిలో నానబెట్టి ఇలా తింటే..?

ఈ ప్యాక్ లో మీరు కాస్త ముల్తానీ మట్టిని కూడా వాడొచ్చు. అంతేకాదు మీ ముఖం జిడ్డు తత్వాన్ని కలిగి ఉంటే పాలకు బదులు రోజ్ వాటర్ కలుపుకోవచ్చు. శనగపిండిని మన ముఖానికి అప్లై చేసుకుంటే ముఖం మృదువుగా మారుతుంది. ఏ మచ్చలు రాకుండా చేస్తుంది. ముఖ్యంగా ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుతుంది. శనగపిండి ముఖాన్ని లోతుగా శుభ్రం చేస్తుంది. 
అంతేకాదు డెడ్ స్కిన్ తొలగిస్తుంది. ముఖంపై ఉన్న మచ్చలను పసుపు తగ్గిస్తుంది. నిమ్మరసం మీ రంగును కూడా మెరుగుచేస్తుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News