నేరేడులో చెట్టు నుంచి మొదలుకుని..పండ్ల వరకూ పోషక గుణాలు మెండుగా ఉంటాయి. ఇందులో పనికిరానిదంటూ ఏ ఒక్కటీ లేదు. ముఖ్యంగా నేరేడు విత్తనాలు ఆరోగ్యానికి చాలా మేలు చేకురుస్తాయి.
ప్రస్తుత బిజీ లైఫ్‌స్టైల్, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా చాలామంది డయాబెటిస్, స్థూలకాయం సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. డయాబెటిస్ పీడితులు తప్పకుండా సరైన డైట్ తీసుకోవాలి. ఎందుకంటే స్థూలకాయం పెరగడం వల్ల శరీరంలో వివిధ రకాల వ్యాధులు వ్యాపిస్తుంటాయి. నేరేడు విత్తనాల్లో ఈ రెండింటినీ దూరం చేసే సామర్ధ్యముంది. నేరేడు విత్తనాలు కిడ్నీలో రాళ్ల సమస్యను సైతం అద్భుతంగా తగ్గిస్తాయి.
నేరేడు విత్తనాల ప్రయోజనాలు
చెడు జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా మధుమేహం ప్రధాన సమస్యగా మారుతుంది. డయాబెటిస్ సమస్య ఉన్నప్పుడు నేరేడు విత్తనాలు అద్భుతంగా ఉపయోగపడతాయి. నేరేడు విత్తనాల పౌడర్ రోజూ ఉదయం ఒక స్పూన్..గోరు వెచ్చని నీళ్లలో కలిపి తాగడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి.
కడుపు సమస్యల్నించి ఉపశమనం
నేరేడు విత్తనాల్లో ఫైబర్, ఫ్యాట్, ప్రోటీన్లు, మినరల్స్, విటమిన్లు సహా పలు పోషక పదార్ధాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండే ఫైబర్ కడుపు సమస్య, మలబద్ధకం నుంచి ఉపశమనం కల్గిస్తుంది. ఫైబర్ కారణంగా కడుపు శుభ్రమౌతుంది. నేరేడు విత్తనాల పౌడర్‌ను సలాడ్, పాలు, జ్యూస్‌తో కలిపి కూడా తీసుకోవచ్చు.
నేరేడు విత్తనాలతో శరీరం డీటాక్స్
నేరేడు విత్తనాల్లో యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లెవనాయిడ్స్ ఉంటాయి. ఇవి మన శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను దూరం చేస్తాయి. శరీరాన్ని డీటాక్స్ చేయడంలో దోహదపడతాయి. నేరేడు విత్తనాలతో ఇమ్యూనిటీ కూడా వేగంగా పెరుగుతుంది. ఫలితంగా రోగాల ముప్పు తగ్గుతుంది. నేరేడు విత్తనాల పౌడర్ సేవించడం వల్ల శరీరానికి తగిన మోతాదులో పొటాషియం లభిస్తుంది. బ్లడ్ ప్రెషర్ తగ్గిస్తుంది. నేరేడు విత్తనాల పౌడర్ తయారు చేయడం చాలా సులభం. ఇంట్లోనే చేయవచ్చు. నేరేడు పండ్లు తిన్న తరువాత విత్తనాల్ని మంచి ఎండలో 2 రోజులు ఆరబెట్టాలి. పూర్తిగా డ్రై అయిన తరువాత మిక్సర్‌లో వేసి పౌడర్ చేసుకోవాలి.
Also read: Dengue Fever: డెంగ్యూ రోగులు పొరపాటున కూడా తినకూడదని పదార్ధాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook