Weight Loss: స్పీడ్‌గా బరువు తగ్గే క్రమంలో జొన్న రొట్టెను ఎలా తినాలి?

Jonna Rotte For Weight Loss: బరువు తగ్గే క్రమంలో జొన్న రొట్టెను తినవచ్చా? దీనికి వైద్యులు ఏమని సమాధానం ఇస్తున్నారంటే.. ప్రతిరోజు బరువు తగ్గే క్రమంలో జొన్న రొట్టెను సరైన మోతాదులో మాత్రమే తీసుకోవాలని.. దీనికి తోడు ప్రోటీన్ కలిగిన ఆహారాలు కూడా తీసుకోవడం చాలా మంచిదని వారు అంటున్నారు.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Nov 10, 2024, 03:46 PM IST
Weight Loss: స్పీడ్‌గా బరువు తగ్గే క్రమంలో జొన్న రొట్టెను ఎలా తినాలి?

Jonna Rotte For Weight Loss: బరువు పెరగడం అనేది సాధారణ సమస్య అయినప్పటికీ ప్రస్తుతం చాలామంది ఆధునిక జీవనశైలి కారణంగా సులభంగా ఈ సమస్య బారిన పడుతున్నారు.. కొంతమంది అయితే చిన్న వయసులోనే ఈ సమస్య బారిన పడి అనేక దీర్ఘకాలిక వ్యాధులకు లోనవుతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని చాలామంది బరువు తగ్గడానికి వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్నారు అయినప్పటికీ ఎలాంటి ఫలితాలు పొందలేకపోతున్నారని వారు వాపోతున్నారు. నిజానికి శరీర బరువు పెంచుకోవడం చాలా సులభమైనప్పటికీ దానిని తగ్గించుకోవడం ఎంతో కష్టంతో కూడుకున్న పనిగా భావించవచ్చు. ఎందుకంటే ఏవైనా అనారోగ్య కరమైన ఆహారాలు రోజు తింటే సులభంగా బరువు పెరుగుతారు. అదే ఈ ఆహారాలు తగ్గించిన బరువు తగ్గలేక పోతారు. నిజానికి శరీర బరువును తగ్గించుకోవడానికి వ్యాయామాలతో పాటు కొన్ని ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకుంటూ రోజు ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. 

బరువు తగ్గే క్రమంలో డైట్ కూడా సరైన పాత్ర పోషిస్తుంది. డైట్ లోని ఆహారాలు బాగుంటేనే మంచి ఫలితాలు పొందగలుగుతారు. అయితే చాలామంది బరువు తగ్గడానికి వ్యాయామాలతో పాటు సరైన డైట్ ప్లాన్ లేకపోవడం వల్ల సులభంగా బరువు తగ్గలేకపోతున్నారు. కచ్చితంగా బరువు తగ్గాలనుకునే వారు తప్పకుండా వైద్యులను సంప్రదించి మీ శరీర బరువుకు అనుగుణంగా సరైన డైట్ ని పాటించడం కీలకమని డైటీషియన్స్ చెబుతున్నారు. అయితే డైట్ లో భాగంగా చాలామంది జొన్న రొట్టెను తీసుకుంటూ ఉంటారు. ఉదయం పూట అల్పాహారంలో జొన్న జావ తాగి.. రాత్రిపూట జొన్న రొట్టెను తింటూ ఉంటారు. ఇలా తినడం ఎంతో మంచిదని కొంతమంది డైటీషియన్స్ అభిప్రాయపడుతున్నారు. జొన్న రొట్టెను తినడం వల్ల శరీర బరువును సులభంగా నియంత్రించుకోవచ్చు. అయితే బరువు తగ్గే క్రమంలో జొన్న రొట్టెను ఎలా తయారు చేసుకోవాలో.. అందులో ఏయే ఇంగ్రిడియంట్స్ వినియోగించాలో ఇప్పుడు తెలుసుకోండి.

కావలసిన పదార్థాలు:
జొన్న పిండి
ఉప్పు
నూనె
వెచ్చటి నీరు

తయారీ విధానం:
జొన్న రొట్టెను తయారు చేసుకోవడానికి ముందుగా ఓ పెద్ద పాత్ర తీసుకోవాల్సి ఉంటుంది అందులో జొన్న పిండిని వేసుకొని కావాల్సినంత ఉప్పు కలుపుకొని పక్కన పెట్టుకోండి. 
ఆ తర్వాత స్టౌ పై బాగా మరిగించిన నీరును తీసుకొని ఈ పిండిలో వేసుకొని రోటీల పిండి లాగా బాగా ఒత్తుకోవాల్సి ఉంటుంది. 
ఆ తర్వాత చపాతీలు గట్టిగా ఉండకుండా మరీ మెత్తగా రాకుండా పిండిని ఒక సరైన మోతాదులో కలుపుకొని గంటసేపు పక్కన పెట్టుకోండి. 
ఇలా కలుపుకున్న పిండిని చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకొని దాదాపు చపాతీల్లాగా రోలర్ పై రోల్ చేసుకోండి. 
ఇలా రోల్ చేసుకున్న చపాతీలను నాన్ స్టిక్ పెనం పెట్టుకొని ఎలాంటి నూనె వేయకుండా రెండు వైపులా బాగా కాల్చుకోవాల్సి ఉంటుంది. 
ఇలా కాల్చుకున్న జొన్న రొట్టెలను పన్నీర్ లేదా చికెన్ కర్రీ తో సర్వ్ చేసుకుంటే బరువు తగ్గే క్రమంలో మంచి ఫలితాలు పొందుతారు. 
Also Read: Trump vs Kamala Harris: అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఎవరు గెలిస్తే భారతీయులకు మేలు జరుగుతుంది..?  

చిట్కాలు: 
ఈ పిండిని కలుపుకునే క్రమంలో నీటిని మరిగించే క్రమంలో ఉప్పు వేసి కూడా మరిగించవచ్చు. ఇలా మరిగించిన నీటిని పిండిలో వేసుకొని కలుపుకుంటే ఉప్పు మరింత బాగా పిండికి పడుతుంది. 
రొట్టెలు చేసేటప్పుడు కేవలం పిండిని మాత్రమే వినియోగించి రోల్ చేయాల్సి ఉంటుంది. బరువు తగ్గే క్రమంలో నూనెను వినియోగించడం అవాయిడ్ చేయండి. 
జొన్న పిండిలో కావాలనుకుంటే కొంత గోధుమ పిండిని కూడా కలుపుకొని ఈ రోటీలను తయారు చేసుకోవచ్చు.
జొన్న పిండితో తయారుచేసిన రోటీలు ఎక్కువగా పగిలిపోతూ ఉంటాయి. ఇలా కాకుండా ఉండడానికి తప్పకుండా కొద్దిసేపు నానబెట్టుకోండి.

Also Read: Trump vs Kamala Harris: అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఎవరు గెలిస్తే భారతీయులకు మేలు జరుగుతుంది..?  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News