Benefits of Coconut Water: రోజూ కొబ్బరి నీరు తాగడం ఆరోగ్యానికి మంచిది. దీనిని సహజ డ్రింక్ గా పేర్కొనవచ్చు. ఇది జ్యూస్, కూల్ డ్రింక్స్ కంటే చాలా మేలు చేస్తుంది. శరీరానికి తక్షణమే శక్తినిచ్చి బాడీని డీహైడ్రేట్ చేస్తాయి కొబ్బరి నీళ్లు. కొబ్బరి నీళ్లలో సహజమైన చక్కెర ఉంటుంది. ఇందులో తియ్యదనం కాస్త తక్కువగానే ఉంటుంది.
పాలలో కంటే కొబ్బరి నీళ్లలో ఎక్కువ పోషకాలు లభిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతారు. ఇందులో కొవ్వు పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది. ఈ కొకొనట్ వాటర్ ను రోజూ తీసుకోవడం వల్ల బాడీకి పొటాషియం, సోడియం, కాల్షియం, మెగ్నీషియం మరియు యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా అందుతాయి. లేత కొబ్బరి నీళ్లను తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ తొలగిపోయి.. మీరు వ్యాధులు బారిన పడకుండా ఉంటారు. అయితే డయాబెటిక్ రోగులు కొబ్బరి నీళ్లు తాగవచ్చో లేదో తెలుసుకుందాం.
డయాబెటిక్ పేషెంట్లు కొబ్బరి నీళ్లు తాగవచ్చా?
డయాబెటిక్ పేషెంట్లు కొబ్బరినీళ్లు తాగవచ్చని ప్రముఖ డైటీషియన్ ఆయుషి తెలిపారు. దీనిని రోజూ తీసుకోవడం ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇది తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ను కలిగి ఉంటుంది. అంతేకాుండా రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంతోపాటు తగ్గిస్తుంది. లేత కొబ్బరి నీళ్లలో ఉండే మెగ్నీషియం ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
కొబ్బరి గుంజు తినడం వల్ల కలిగే లాభాలు
కొబ్బరి నీళ్లతో పాటు డయాబెటిక్ పేషెంట్లు దానిలో ఉండే గుంజును కూడా తినవచ్చు, ఎందుకంటే ఇందులో జీవక్రియను మెరుగుపరచడంలో సహాయపడే అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే దీనిని తినడం వల్ల శరీరంలోని కొవ్వు తగ్గుతుంది. దీంతో మీరు బరువు తగ్గుతారు. ఇందులో ఉండే మంచి కొలెస్ట్రాల్ గుండె జబ్బులు ప్రమాదాన్ని నివారించడంలో సహాయపడుతుంది.
Also Read: Walking Benefits: రోజూ ఉదయం అరగంట సేపు నడిస్తే చాలు.. ఈ 3 వ్యాధులు రావు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK