Food for Men: ఉరుకులు పరుగులతో కూడిన జీవితంలో పురుషుల ఆహారపు అలవాట్లలో చాలా మార్పులొచ్చేశాయి. అందుకే ఫిట్నెస్ లోపిస్తోంది. మరి ఫిట్‌గా ఉండేందుకు డైట్‌లో ఏయే ఆహార పదార్ధాల్ని చేర్చాలో తెలుసుకుందాం..
ఆధునిక పోటీ ప్రపంచంలో బిజీ లైఫ్ కారణంగా ఆహారపు అలవాట్లలో చాలా మార్పులు వచ్చేశాయి. ముఖ్యంగా మగవారి ఆహారపు అలవాట్లు మారిపోయాయి. ఫలితంగా వివిధ రకాల లైఫ్‌స్టైల్ వ్యాధులు వెంటాడుతున్నాయి. ఫిట్‌నెస్ కోల్పోతున్నారు. అందుకే ఆహారపు అలవాట్లపై పురుషులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరముంది. మీ బాడీ ఫిట్‌గా ఉండాలంటే..మంచి ఆహారం తీసుకోవడమే కాకుండా..బ్రేక్‌ఫాస్ట్ , లంచ్ ఎప్పుడూ స్కిప్ చేయకూడదు. అలా చేయాలంటే తమ ఆహారంలో దీర్ఘకాలం ఫిట్ అండ్ హెల్తీగా ఉంచే పోషక పదార్ధాల్ని చేర్చాల్సి ఉంటుంది. డైట్‌లో ఏయే ఆహార పదార్ధాల్ని చేర్చాలో తెలుసుకుందాం..
గుడ్లు ప్రతి ఒక్కరికీ ప్రయోడజనాన్నిస్తాయి. గుడ్లలో శరీరానికి కావల్సిన పోషకపదార్ధాలు సమృద్ధిగా ఉంటాయి. అందుకే సూపర్‌ఫుడ్ జాబితాలో గుడ్లకు అగ్రస్థానం ఉంటుంది. గుడ్డులో ప్రోటీన్లు, ఐరన్, కాల్షియం, విటమిన్ బి, విటమిన్ డి సమృద్ధిగా ఉంటాయి. రోజూ ఒక గుడ్డు తీసుకుంటే పురుషులు ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉంటారు.
ఇక మరో ఆహార పదార్ధం డైరీ ఉత్పత్తులు. అంటే డైట్‌లో పాల ఉత్పత్తుల్ని తప్పకుండా చేర్చాలి. పాల ఉత్పత్తులనేవి పురుషులకే కాదు మహిళల ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిది. కానీ పురుషులకు పాలు , పెరుగు అత్యవసరమని చెప్పవచ్చు. పాలు, పెరుగు తినడం వల్ల శరీరానికి ప్రోటీన్లు, కాల్షియం, ల్యాటిన్ లభిస్తాయి. ఫలితంగా మజిల్స్ పటిష్టానికి ఉపయోగపడతాయి. పురుషులకు ఇది చాలా అవసరం.
ఇక డ్రై ఫ్రూట్స్ అనేవి డైట్‌లో తప్పకుండా ఉండాల్సిందే. డ్రై ఫ్రూట్స్, నట్స్, సీడ్స్ రోజూ తీసుకోవాలి. వీటివల్ల శరీరానికి ప్రోటీన్లు, ఫైబర్ అవసరమైన పోషక పదార్ధాలు లభిస్తాయి. డ్రై ఫ్రూట్స్‌లో ముఖ్యంగా బాదం, అఖ్రోట్ తినాలి. ఇవి కాకుండా సీడ్స్ కూడా రోజూ తీసుకుంటే మంచిది. ఇక నట్స్ అనేవి ప్రోస్టేట్, కోలన్ కేన్సర్ ముప్పు నుంచి కాపాడతాయి.
Also read: Face Care Tips: పాల మీగడతో మీ ముఖ సౌందర్యం..బంగారంలా మెరిసిపోతుంది..ఎలాగంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి