Telangana Style Natu Kodi Pulao Recipe: తెలంగాణలోని అత్యంత ప్రాముఖ్యత కలిగిన వంటకాలలో నాటు కోడి పులావ్ ఒక ప్రసిద్ధమైన వంటకం. నాటు కోడి, బాస్మతి బియ్యం, వివిధ రకాల మాసాలతో తయారు చేస్తారు. దీనిని అందరూ ఎంతగానో ఇష్టపతారు. అలాగే ఈ డిష్‌ను కొన్ని రెస్టారెంట్స్ సిగ్నెచర్ డిష్‌గా కూడా వడ్డిస్తారు. వారంలో ఒక్కసారైనా ఈ నాటు కోడి పులావ్‌ను తినడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి. ఈ పులావ్‌ను ఎక్కువగా నల్లగొండ, వరంగల్, ఖమ్మం వంటి తెలంగాణ జిల్లాల్లో తయారు చేసుకుని తింటూ ఉంటారు. అయితే మీరు కూడా ఈ పులావ్‌ను ఇంట్లోనే తయారు చేసుకోవాలనుకుంటున్నారా? ఇలా సింపుల్ టిప్స్ పాటిస్తూ ఇంట్లోనే తయారు చేసుకోండి.
తెలంగాణ స్టైల్ నాటు కోడి పులావ్‌కి తయారీ కావాల్సిన పదార్థాలు:
నాటు కోడి - 1 కిలో
బాస్మతి బియ్యం - 2 కప్పులు
ఉల్లిపాయలు - 2 (తరిగినవి)
టమోటాలు - 2 (తరిగినవి)
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 2 టేబుల్ స్పూన్లు
పచ్చిమిరపకాయలు - 5 నుంచి 6 (తరిగినవి)
జీలకర్ర - 1 టీస్పూన్
శనగపప్పు - 1 టీస్పూన్
మెంతులు - 1 టీస్పూన్
పసుపు - 1/2 టీస్పూన్
మిరపకాయలు - 1 టీస్పూన్
గరం మసాలా - 1/2 టీస్పూన్
కరివేపాకు - 1 రెబ్బ
నూనె - 3 టేబుల్ స్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా
నీరు - 4 కప్పులు
తయారీ విధానం:
ఈ తెలంగాణ స్టైల్ నాటు కోడి పులావ్‌ని తయారు చేసుకోవడానికి ముందుగా ఓ బౌల్ తీసుకోవాల్సి ఉంటుంది.
ఆ బౌల్‌లో బియ్యాన్ని వేసుకుని దాదాపు 30 నిమిషాలు పాటు బాగా నానబెట్టుకోండి.
ఒక పాత్రలో నూనె వేడి చేసి, జీలకర్ర, శనగపప్పు, మెంతులు వేసి వేయించాలి.
ఆ తర్వాత ఉల్లిపాయలు వేసి బంగారు గోధుమ రంగు వచ్చేవరకు వేయించాలి.
అవి బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, టమోటాలు, పచ్చిమిరపకాయలు వేసి బాగా వేయించాలి.
ఇలా వేయించిన తర్వాత పసుపు, మిరపకాయలు, గరం మసాలా, కరివేపాకు వేసి కలపాలి.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
ఆ తర్వాత ముక్కలుగా కోసిన నాటు కోడిని వేసి, మసాలా బాగా పట్టేలా కలపాలి.
ఇందులోనే ఉప్పు వేసి, కొద్దిగా నీరు పోసి మూత పెట్టి ఉడికించాలి.
కోడి ఉడికిన తర్వాత, నానబెట్టిన బియ్యాన్ని, నీటిని వేసి మళ్లీ మూత పెట్టి ఉడికించాలి.
నీరు పూర్తిగా ఆవిరైపోయే వరకు ఉడికించి, వేడిగా వడ్డించాలి.
చిట్కాలు:
ఈ తెలంగాణ స్టైల్ నాటు కోడి పులావ్ మరింత రుచిగా ఉండాలంటే, పుదీనా, కొత్తిమీర వంటి తాజా ఆకులను కూడా వేయవచ్చు.
నాటు కోడి బదులుగా బ్రైయిలర్ చికెన్ కూడా ఉపయోగించవచ్చు.
మీరు పులావ్‌ను మరింత స్పైసీగా చేయాలనుకుంటే, మరింత కారం కూడా వినియోగించండి.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి